ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేడు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తూ.. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అంటూ తెలుగులో మాట్లడటం ప్రారంభించారు. మీ ఉత్సహం చూస్తుంటే నాకు బీజేపీ గెలుస్తుందని నమ్మకం కలుగుతుందన్నారు. మోడీ గ్యారెంటీ అంటే పూర్తి అయ్యే గ్యారెంటీ (తెలుగులో) అన్నారు. మోడీ ఎం చెబితే అది చేసి చూపిస్తాడని ఆయన అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలని, ఆర్టికల్…
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనలను పెంచారు. ఈ నెల 7,8 తేదీల్లో సీఎం వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
ప్రపంచ కుబేరుడు ఎవరు? అంటే వెంటనే గుర్తుకు వచ్చేపేరు ఎలాన్ మస్క్.. కొన్ని నెలలుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నారు టెస్లా చీఫ్.. అయితే, ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది.. ఆయన అత్యంత కుబేరుల జాబితాలో రెండోస్థానానికి పడిపోయారు..!
నేడు మంగళగిరిలో టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి. టీడీపీ-జనసేన కూటమి ఆధ్వర్యంలో ఇవాళ జయహో బీసీ సభ జరగనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏఎన్యూ ఎదురుగా ఉన్న స్థలంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరవనున్నారు. బీసీల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ…
రాష్ట్ర డీజీపీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నామినేషన్లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖ రాశారు. 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని లేఖలో కోరారు.
ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇక్కడే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని.. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటామన్నారు.
దేశ ప్రధాని పర్యటనపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. ఇవాళ ఆయన ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. టెక్స్ టైల్ పార్కు ఇవ్వలేదని, మోడీ ఎందుకు వచ్చినట్టు అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఆదిలాబాద్ పై చిన్న చూపు చూసారని, ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేసినట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. 4 మంది ఎమ్మెల్యేలను ప్రజలను గెలిపిస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా అని ఆయన మండిపడ్డారు. ప్రజల సొమ్ము ఖర్చు…
ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజలు పాటు తెలంగాణలో పర్యటిస్తున్నారు. నేడు రెండో రోజు సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోడీ. అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే.. ఈ భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేద్దామన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ని బండకేసి కొడితే…
వైసీపీకి, మంత్రి పదవికి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరుతున్నానని తెలిపారు.
మావోయిస్టుల లింకు కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. తమను దోషులుగా ప్రకటిస్తూ 2017 సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సాయిబాబా, ఇతరులు చేసిన అప్పీల్పై కోర్టు తీర్పు వెలువడింది.