Demolitions: చెరువు కబ్జాలపై రంగారెడ్డి కలెక్టర్ సీరియస్ అయ్యారు. గండిపేట, నెక్నామ్ పూర్‌లోని ఇబ్రహీం చెరువులో బఫర్ జోన్‌లో నిర్మిస్తున్న విల్లాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. విల్లాలను కూల్చివేస్తుండగా అడ్డుకునేందుకు బిల్డర్స్ ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎకరం విస్తీర్ణంలో చెరువు స్థలంలో అక్రమ విల్లాల నిర్మాణాలను రెవెన్యూ శాఖ గుర్తించింది. గండిపేట తహసీల్దారును ఇప్పటికే బెదిరించిన బిల్డర్ గోవర్ధన్. కూల్చివేతలు ఆపకుంటే అంతు చూస్తానంటూ తహసీల్దారును గోవర్ధన్ బెదిరించినట్లు తెలిసింది. ప్రైవేటు సైన్యంతో బిల్డర్ కూల్చివేతలను అడ్డుకుంటున్నట్లు సమాచారం.
Read Also: Bomb Alert : ముంబై టు బెంగళూరు విమానంలో బాంబు.. భార్య కోసం అబద్ధం చెప్పిన భర్త