ఆర్టీసీలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ లో ఉద్యోగులు ఎదురు పీఆర్సీ , పెండింగ్ బిల్స్ పై త్వరలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి తో ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన 2017 ,2021 పిఆరిసీ పెండింగ్ బిల్స్ కి సంబంధించిన దానిపై ఈరోజే మాట్లాడతా అని ఆయన వెల్లడించారు. ఆర్టీసీ సంస్థ, ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్రానికి పునాది అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఉద్యోగులు మేడారం జాతర కోసం చాలా కష్టపడ్డారని, ఎలక్షన్స్ కోడ్ , కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మహాలక్ష్మి స్కీమ్ వర్క్ లోడ్ కారణంగా ఆర్టీసీ బకాయిల పై నిర్ణయం అలస్యమైందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు మాహాలక్షి పథకం పేరు మీద అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించామని, ఇప్పటికే సీఎం ఆర్టీసీ కార్మికుల 280 కోట్ల బాండ్స్ ప్రకటించారు అవి కూడా రెండు మూడు రోజుల్లో పేమెంట్స్ రిలీజ్ చేస్తామన్నారు మంత్రి పొన్నం. ఎన్నికల కోడ్ వస్తె ఆగిపోకుండా ముందే పేమెంట్ స్టార్ట్ చేయాలని ఎండి గారిని కోరుతున్నానని, ఆర్టీసీ లో ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి రావడానికి కృషి చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల పాట పట్టింది.. ఆర్టీసీ మహాలక్ష్మి స్కీమ్ తో కళకళలాడుతోందని, కొత్త బస్ లు, ఉద్యోగుల నియామకాల ను త్వరలోనే చేపడతామన్నారు. అవార్డ్స్ పొందుతున్న వారిని స్ఫూర్తిని తీసుకొని మిగతా ఉద్యోగులు మంచిగా పని చేయాలని ఆయన కోరారు.
Sai Dharam Tej: ఏటిఎం నుంచి బయటికి వచ్చి ఏడ్చేశాను..అమ్మ గొప్పతనం అప్పుడే అర్థమైంది..
మహాలక్ష్మి స్కీమ్ లో చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయి.. మహిళలు జీరో టికెట్ తీసుకున్న ఆ డబ్బును ప్రభుత్వం రీయంబర్స్మెంట్ చేస్తుంది ఉద్యోగులు గమనించాలని, మహిళలకు ఉచిత బస్సు ,500 కే గ్యాస్ ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ ,ఈ నెల 11 నుండి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాల తో ప్రభుత్వం ముందుకు వెళ్తామని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ కి ప్రభుత్వం ఆర్థికంగా వెంటనే సహాయం చేసే పరిస్థితి లేదు.. కానీ ఉన్నంత లో మీకు న్యాయం చేస్తా.. ఆర్టీసి లో త్వరలోనే నియామకాలు జరగబోతున్నాయి.. ఓవర్ లోడింగ్ తగ్గించడానికి త్వరలోనే మరిన్ని కొత్త బస్సులు వస్తున్నాయి.. సంస్థ భవిష్యత్ యొక్క మార్గదర్శకత్వం తో ముందుకు తీసుకుపోతా.. కార్మికుల నుండి ,ఉద్యోగుల నుండి సలహాలు సూచనలు స్కీకరిస్తం .. రేపు మహిళా దినోత్సవం ఆర్టీసి డ్రైవర్లు గా మహిళలు వచ్చిన ప్రోత్సహించాలని కోరుతున్న.. తెలంగాణ మహిళలందరికీ మహిళా దినోత్సవ ,శివరాత్రి శుభాకాంక్షలు’ తెలిపారు మంత్రి పొన్నం.
Suhas : రెమ్యూనరేషన్ ను పెంచడం పై సుహాస్ షాకింగ్ కామెంట్స్..