ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాలసముద్రంలోని ఏకాశీల పార్క్ ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అమలుకు నోచుకోని దొంగ హామీలను ఇచ్చారన్నారు. ఆరు గ్యారెంటీ ల పథకాలను చెప్పి ఏవి కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను రద్దు చేస్తూ.. గత ప్రభుత్వంపై…
తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ పేర ప్రజలపై 20 వేల కోట్ల భారం మోపేల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్ర…
NDSA బృందం నాలుగు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఎ నాలుగు నెలలు రిపోర్టు సమర్పిస్తామని తెలిపిందని, అంతకన్నా ముందే ప్రాథమిక రిపోర్ట్ వీలైనంత తొందరలో ఇవ్వాలని కోరామన్నారు. దాని ఆధారంగా వెంటనే డాం రిపేర్ తో పాటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ టిఆర్ఎస్ కు ఏటీఎంగా మారటానికి ప్రధాన కారణమే మోడీ ప్రభుత్వమని, కార్పొరేషన్ల ద్వారా 84 వేల కోట్ల రుణం అందించింది…
రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం 'రైతు నేస్తం'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ప్రారంభించారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య నిరంతర యుద్ధం జరుగుతోంది. ఇదిలావుండగా.. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో మంగళవారం జరిగిన క్షిపణి దాడిలో భారతీయ పౌరుడు మరణించాడు. మరో ఇద్దరు భారతీయులు గాయపడ్డారు. ఈ దాడి జరిగిన ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ ప్రజలకు భద్రతా సలహాను జారీ చేసింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిట్స్ పిలాని కళాశాల వేదికగా జరుగుతున్న వేడుకలలో ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. బిట్స్ పిలాని కళాశాలలో వీ ఫర్ యూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటెడ్ హాల్ టికెట్లను స్కూళ్లకు అధికారులు పంపించారు.
రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ, అభయహస్తం గ్యారెంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని, మరో రెండు గ్యారెంటీ పథకాల అమలును ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని కొత్తగూడలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని విద్యశ్రీ (23) బలవన్మరణానికి పాల్పడింది. 12 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.