Sahithi Infra: సాహితీ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ.200 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు సీసీఎస్ పోలీసులు. సాహితీ పార్టనర్స్‌తో పాటు సంస్థ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న, రాజకీయ నాయకులకు, బడా వ్యాపారులకు ఉచ్చు బిగుస్తోంది. రెండు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న కొందరి నాయకులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు హైదరాబాద్ పోలీసులు. కేసు విచారణ ముమ్మరం చేయడంతో లక్ష్మీనారాయణ కుటుంబం అజ్ఞాతవాంలోకి వెళ్లింది. పరారీలో ఉన్న లక్ష్మీనారాయణ కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు.
Read Also: Mallareddy: మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి రెవెన్యూ అధికారుల షాక్
సాహితీ ఇన్‌ఫ్రా కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గతంలో ఏపీలోని సాహితీ ఇన్‌ఫ్రా యజమాని బుదాటి లక్ష్మీనారాయణ ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. రూ.1500 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తివేసిన సాహితీ ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, ఆస్తులను అటాచ్ చేశామని సీసీఎస్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. సాహితీ ఇన్‌ఫ్రాపై ఇప్పటివరకు 50 కేసులు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మంది నుంచి రూ.530 కోట్లు వసూలు చేసిందని, 38 అంతస్తుల అపార్ట్‌మెంట్ నిర్మాణం పేరుతో భారీ మోసానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. మరో ప్రాజెక్టులో రూ.900 కోట్లు సాహితీ ఇన్‌ఫ్రా వసూలు చేసిందని సమాచారం. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో హైదరాబాద్‌లోని సుమారు 3 వేల మంది వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్టు బాధితులిచ్చిన ఫిర్యాదుతో సీసీఎస్‌లో కేసు నమోదైంది.