2018లో జరిగిన అంకిత్ సక్సేనా హత్య కేసులో తీస్ హజారీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన ముగ్గురు దోషులకు తీస్ హజారీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహ్మద్ సలీం, అక్బర్ అలీ, అతని భార్య షహనాజ్ బేగంలకు కోర్టు శిక్ష విధించింది. దీంతో పాటు ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి రూ.50,000 జరిమానా కూడా విధించింది. ఈ కేసుపై తీర్పును వెలువరిస్తూ.. దోషుల వయస్సు, నేర చరిత్రను పరిగణనలోకి తీసుకుని వారికి…
ఆర్టీసీలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ లో ఉద్యోగులు ఎదురు పీఆర్సీ , పెండింగ్ బిల్స్ పై త్వరలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి తో ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన 2017 ,2021 పిఆరిసీ పెండింగ్ బిల్స్ కి సంబంధించిన దానిపై ఈరోజే మాట్లాడతా అని ఆయన వెల్లడించారు. ఆర్టీసీ సంస్థ, ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్రానికి పునాది…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష సరైంది కాదని, ఆయన మాట్లాడే భాష పై సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియా తో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఉన్మాద భాష మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 90 రోజుల నుండి రేవంత్ రెడ్డి మాట్లాడే భాష పై …రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, బొంద పెడతాం, మానవ బాంబులు అయితాం, పండబెట్టి తోక్కుతాం అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు…
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డ్ సృష్టించాడు. రన్ మిషన్, కింగ్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కోహ్లీ పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును యశస్వి బద్దలు కొట్టాడు. ఇంతకుముందు కోహ్లి 2016-17లో భారత్ లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 8 ఇన్నింగ్స్ ల్లో 109.2 రన్స్ చేశాడు. తాజాగా.. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్…
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారని ఆయన వ్యాఖ్యానించారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు విడి విడిగా…
చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను రష్యా ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు వ్లాదిమిర్ పుతిన్ సర్కార్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. కాస్పరోవ్ పుతిన్ సర్కార్ పై బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశాడు. అందు కారణంగా ఆయన్ను 'ఉగ్రవాదులు, తీవ్రవాదులు' జాబితాలో చేర్చినట్లు రష్యా మీడియా తెలిపింది.
సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి(SH01) ఎలివేటెడ్ కారిడార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందని ఆయన తెలిపారు.
ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని కేటీఆర్ మాట్లాడితే ఆశ్చర్యంగా అనిపిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు మా మధ్య పుల్లలు పెడుతున్నారని.. సీతక్క ఆడ బిడ్డలందరికీ ప్రతీక అని ఆయన అన్నారు. సీతక్క అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోర్ట్ ఫోలియో నిర్వహిస్తున్నారన్నారు.
సాహితీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ.200 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు సీసీఎస్ పోలీసులు. సాహితీ పార్టనర్స్‌తో పాటు సంస్థ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న, రాజకీయ నాయకులకు, బడా వ్యాపారులకు ఉచ్చు బిగుస్తోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల కోసం బీజేపీ వివిధ కమిటీలు వేసింది. ఆ కమిటీలు చేసిన, చేయాల్సిన పనులపై కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలకు కిషన్ రెడ్డి సూచనలు చేశారు.