Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2015లో కేవలం నెలకు 37,000 రూపాయల వేతనంతో ఒక సర్వీస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఒక టెక్ ప్రొఫెషనల్, నేడు 2.2 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని అందుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. అతడి చదువు కూడా పెద్ద పెద్ద కాలేజీల్లో సాగలేదు. ధనిక కుటుంబ నేపథ్యం లేకపోయినా, కేవలం స్వయంకృషి, నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలతో 11 ఏళ్ల కాలంలోనే ఆయన ఈ ఘనత సాధించారు.
తొలి కంపెనీలో నాలుగేళ్ల పాటు పనిచేసి, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుంటూ నెలకు 1.1 లక్షల జీతానికి చేరినప్పటికీ, కంఫర్ట్ జోన్ నుంచి బయటపడేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే 2019లో ప్రసిద్ధ ఫాంగ్ (FAANG) కంపెనీలలో ఒకదానిలో 44 లక్షల వార్షిక ప్యాకేజీతో అవకాశం సాధించారు. అయితే… కరోనా సమయంలో పెరిగిన పని ఒత్తిడి, మానసిక ఆందోళన కారణంగా 2020లో చేతిలో మరొక ఉద్యోగం లేకపోయినా ధైర్యంగా ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఒక అమెరికన్ రియల్ ఎస్టేట్ స్టార్టప్‌లో చేరి, తన ప్రతిభతో ఎనిమిది నెలల్లోనే ప్రమోషన్ పొంది జీతాన్ని 70 లక్షల వరకు పెంచుకున్నారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచకం.. హసీనా రాకముందే బాంబు దాడులు, ఆందోళనలు!
- UP Elections: యూపీలో ఒవైసీ-చంద్రశేఖర్ పొత్తు.. బీజేపీ హ్యాపీ, అఖిలేష్లో టెన్షన్.!
- Minister Ponguleti: 22A బాధితులకు గుడ్‌న్యూస్.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..
- Pat Cummins: ట్యాంపరింగ్ కలకలం.. పబ్లిక్‌లోనే భార్యతో గొడవ.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక ప్రకటన..
ఆపై ఒక ఫిన్‌టెక్ స్టార్టప్‌లో సీటీఓగా బాధ్యతలు స్వీకరించి వ్యవస్థాపక అనుభవాన్ని గడించినప్పటికీ, నిబంధనలు, లైసెన్స్ సమస్యల వల్ల ఆ వ్యాపారాన్ని వీడాల్సి వచ్చింది. 2024లో ఒక భారతీయ స్టార్టప్‌లో 1.2 కోట్ల ప్యాకేజీ లభించినా, అక్కడ ఉన్న టాక్సిక్ వాతావరణం నచ్చక మూడు నెలల్లోనే బయటకు వచ్చేశారు. చివరకు ఫిబ్రవరి 2025లో తిరిగి మరో ఫాంగ్ కంపెనీలో 1.5 కోట్ల ఆఫర్‌తో చేరి, మార్చి 2026 నాటికి తన అత్యుత్తమ పనితీరుతో ప్రమోషన్ సాధించి, కంపెనీ స్టాక్స్‌తో కలిపి ఏటా 2.2 కోట్ల ప్యాకేజీ స్థాయికి చేరుకున్నారు. కెరీర్లో ఎన్ని సవాళ్లు, ఉద్యోగ మార్పులు ఎదురైనా వెనకడుగు వేయకుండా సాధించిన ఈ విజయం నేటి యువతకు గొప్ప స్ఫూర్తినిస్తుంది.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచకం.. హసీనా రాకముందే బాంబు దాడులు, ఆందోళనలు!
-
Big Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
-
North Korea: అమెరికా దెబ్బకు వణికిపోతున్న కిమ్.. 54 ఏళ్ల తర్వాత రాజ్యాంగం మార్చి సంచలన నిర్ణయం!
-
UP Elections: యూపీలో ఒవైసీ-చంద్రశేఖర్ పొత్తు.. బీజేపీ హ్యాపీ, అఖిలేష్లో టెన్షన్.!
-
Minister Ponguleti: 22A బాధితులకు గుడ్‌న్యూస్.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!