Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiva Nirvana: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, మెలోడీ, ఎనర్జిటిక్ సాంగ్స్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’లోని మోస్ట్ అవైటెడ్ సాంగ్ ‘మల్లెపూల పల్లకి’ని మేకర్స్ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో విడుదల చేశారు. అయ్యప్ప భక్తుల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉన్న ఈ పాటకు ఒరిజినల్ భక్తి భావాన్ని కొనసాగిస్తూనే సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కొత్త మ్యూజికల్ టచ్ ఇచ్చారు. గ్రాండ్ ఆర్కెస్ట్రేషన్, పవర్ఫుల్ రిథమ్స్‌తో పాటను మరింత ఎనర్జిటిక్‌గా తీర్చిదిద్దారు. ఈ పాట గురించి దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘మల్లెపూల పల్లకి’ కోసం చాలా శ్రమించామని తెలిపారు. ఒరిజినల్ కంపోజర్స్, సింగర్స్‌ను పిలిపించి వారితోనే ఈ పాటను చేయించినట్లు చెప్పారు. ఈ పాట థియేటర్లో తాండవంలా ఉంటుందని పేర్కొన్నారు.
‘ఇరుముడి’ తన గత చిత్రాల మాదిరిగా లైట్‌హార్టెడ్‌గా ఉండదని శివ నిర్వాణ స్పష్టం చేశారు. ఇది చాలా సీరియస్, ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా అని తెలిపారు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను అత్యంత ఉత్కంఠభరితమైన డ్రామాలోకి తీసుకెళ్తాయని చెప్పారు. తెలుగు సినిమాల్లో వచ్చిన మోస్ట్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఫ్యామిలీ డ్రామాల్లో ‘ఇరుముడి’ ఒకటిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రవితేజతో పనిచేయడం గర్వంగా ఉందని శివ నిర్వాణ అన్నారు. ఆయన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు మరోసారి చూడాలనిపించేలా ఉంటుందని తెలిపారు. సీలేరు ప్రాంతంలోని రియల్ లొకేషన్స్‌లో సినిమాను తెరకెక్కించినట్లు చెప్పారు. రవితేజతో పాటు ప్రియా భవానీ శంకర్, సాయికుమార్, నక్షత్ర, అజయ్ ఘోష్ తదితరులు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని ప్రశంసించారు. ముఖ్యంగా రవితేజ, నక్షత్ర మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయని శివ నిర్వాణ పేర్కొన్నారు. నక్షత్ర పెర్ఫార్మెన్స్ చూస్తే కన్నీళ్లు వచ్చేంతగా ఉంటుందని అన్నారు. ప్రియా భవానీ శంకర్‌కు సినిమాలో మూడు కీలక సన్నివేశాలు ఉన్నాయని, అవి థియేటర్లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయని చెప్పారు.
Also Read
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంపై కూడా శివ నిర్వాణ ప్రశంసలు కురిపించారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే ఆయన సంగీతాన్ని ఇష్టపడుతున్నానని, ‘ఇరుముడి’కి జీవీ ప్రకాష్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని తెలిపారు. సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ తనకు రైట్ హ్యాండ్‌లా పనిచేశారని, సినిమా చూసిన తర్వాత ఆయన సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారని శివ నిర్వాణ అన్నారు. మొత్తంగా ‘ఇరుముడి’ కేవలం ఫ్యామిలీ డ్రామా మాత్రమే కాదని.. ప్రేక్షకులకు బలమైన ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మంచి మెసేజ్‌ను అందించే సినిమా అని దర్శకుడు శివ నిర్వాణ వెల్లడించారు. ఆగస్టు 21న ఈ సినిమా థియేటర్లలోకి రానుండటంతో రవితేజ అభిమానుల్లోనూ, సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?