ఏపీలో పెను ప్రమాదం తప్పింది. ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలస రైల్వే స్టేషన్ లో విశాఖపట్నం టు భవానీపట్నం వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో.. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. లోకో పైలట్ ఎం.హెచ్.ఆర్ కృష్ణ అప్రమతం అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరగా.. గంట వ్యవధిలోనే కొత్తవలస…
కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది. రాజుపాలెం వద్ద నదిలో మునిగి అక్క తమ్ముడు గల్లంతయ్యారు. స్నానం కోసం కుందూ నదిలో దిగి మస్తాన్(27), ఇమాంబి(28) లు మృతి చెందారు. కుందు నదిలో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి అక్క తమ్ముడు మృతి చెందారు. మృతులు చాగలమర్రికి చెందినవారిగా గుర్తించారు.
మేదరమెట్ల సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వాగ్దానాలకు, శకుని చేతిలో పాచికలకు తేడా లేదు అని దుయ్యబట్టారు. చంద్రబాబు.. 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటైన అమలు పరిచారా ? అని ప్రశ్నించారు. మళ్లీ పొత్తు పెట్టుకుని ఇంతకు మించి హామీలు ఇచ్చి మీ దగ్గరకు రావడానికి రెడీ అయ్యారని సీఎం జగన్ తెలిపారు. ప్రజలకు మంచి చేయక పోగా ప్రజలకు మంచి చేసిన జగన్ ని టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ స్పందించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను పట్టుకొని మల్కాజిగిరికి ఈటల రాజేందర్ కు సంబంధం ఏంటి అని అడుగుతున్నాడు. ఈటల రాజేందర్ అనేటోడు ఒక కులానికో, ప్రాంతానికో, మతానికి సంబంధించిన బిడ్డ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ 22 సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టిబిడ్డగా, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన బిడ్డను అని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరి మీద…
న్యాయపరమైన చిక్కులను తొలగించి ఉపాధ్యాయుల బదిలీలు,పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విస్తృత కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. రెండవ రోజు హైదరాబాద్ లోని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కే .జంగయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి లు ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్ర…
మేదరమెట్ల వద్ద వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. త్వరలోనే మేనిఫేస్టో విడుదల చేస్తామని తెలిపారు. మేం చేసేదే చెప్తాం.. చెప్పేదే చేస్తాం అన్నారు. చంద్రబాబు మేనిఫేస్టోకు.. శకుని చేతిలో పాచికలకు తేడా ఉందా..? అని దుయ్యబట్టారు. చంద్రబాబు చెప్పే అబద్దాలకు హద్దే లేదని విమర్శించారు. అధికారమంటే నాకు వ్యామోహం లేదు.. అధికారం పోతుందన్న భయంలేదు.. హిస్టరీ బుక్ లో మీ బిడ్డ పేరు ఉండాలన్నదే తన కోరిక అని సీఎం జగన్ తెలిపారు. ఎన్నికల…
రైతులు కష్టాలు తీరాలంటే చంద్రబాబుకు పట్టం కట్టాలని, రైతును దగా చేసిన సీఎం జగన్ పాలనకు చరమగీతం పాడాలని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టిడిపి నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఎమ్మిగనూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు గల కూరగాయల వేలం మార్కెట్ నందు,ఎద్దుల మార్కెట్ యందు, మేకల బజార్ లో తిరిగి బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పై ప్రచారం నిర్వహించారు. రైతులను కలుసుకొని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, బాధలను విన్నారు.…
మేదరమెట్లలో వైసీపీ నిర్వహించిన 'సిద్ధం' సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. మేదరమెట్లలో ఉప్పెనలా వచ్చిన జనసమూహం కనిపిస్తోంది.. సభకు వచ్చిన ప్రజల్ని చూస్తుంటే మహాసముద్రాన్ని తలపిస్తోందని అన్నారు. నాపై నమ్మకంతో వచ్చిన అందరికీ ధన్యవాదాలు.. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దామని తెలిపారు. పేదవాడి భవిష్యత్ ను కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా అని అన్నారు. పార్టీల పొత్తులతో చంద్రబాబు.. ప్రజలే బలంగా మనం తలబడుతున్నామని చెప్పారు. పేదలను గెలిపించడమే తన లక్ష్యమన్నారు. జగన్ ను ఓడించాలని…
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు మేము ఊహించిందే.. బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద చివరి సిద్ధం సభ గురించి మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి సిద్ధం సభ సూపర్ సక్సెస్ అవుతుందని ఆయన అన్నారు. 15 లక్షలకు మించి ప్రజలు హాజరవుతారన్నారు. ఈ సభ మాకు ఎన్నికల ప్రచారం లాంటిదన్నారు. గత సభలకు మించి ప్రజల స్పందన ఉందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు మేము ఊహించిందేనని వ్యాఖ్యానించారు. ఏపీలో 90 శాతం…
ఢిల్లీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఏపీలో అభ్యర్థుల ఖరారుపై బీజేపీ తుది కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలోని బృందం ఏపీకి వచ్చింది. గజేంద్ర సింగ్ షెకావత్ బృందంలో ఒడిశా ఎంపీ జై జయంత్ పాండా ఉన్నారు. అభ్యర్థుల ఎంపికపై గజేంద్ర సింగ్ షెకావత్ తో పురంధేశ్వరి భేటీ అయ్యారు. ఈ చర్చల్లో బీజేపీ అగ్ర నేతలు శివ ప్రకాష్, మధుకర్ కూడా…