Drugs Seized: తమిళనాడులో రూ.100 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Seized: తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలోని మిమిసాల్ గ్రామంలోని రొయ్యల ఫారంలో కస్టమ్స్ అధికారులు రూ.100 కోట్లకు పైగా విలువైన హాషీష్ ఆయిల్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మండపం సమీపంలో రూ.108 కోట్ల విలువైన 99 కిలోల హషీష్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
శ్రీలంకకు అక్రమ రవాణా చేసేందుకు రొయ్యల ఫారమ్‌లో హషీష్, గంజాయి వంటి డ్రగ్స్ పెద్ద మొత్తంలో సేకరించినట్లు సమాచారం అందిందని కస్టమ్స్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని వ్యక్తుల సమక్షంలో తాళం పగులగొట్టి హషీష్ ఆయిల్, గంజాయి నింపిన 48 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పొలంలో విద్యుత్ సరఫరా లేనందున నిషేధిత పదార్థాన్ని సమీపంలోని కస్టమ్స్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఇక్కడ పరీక్షించిన అనంతరం బ్యాగులో నుంచి రూ.110 కోట్ల విలువైన 100 కిలోల హషీష్, రూ.1.05 కోట్ల విలువైన 876 గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) యాక్ట్ 1985, కస్టమ్స్ యాక్ట్ కింద స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- YS Jagan: రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు..! ప్రజాస్వామ్యం గురించి నీతులా? జగన్ సంచలన వ్యాఖ్యలు
- Perni Nani: పులివెందులలో గెలిచింది ఇలాగేనా..? టీడీపీ అరాచకానికి పరాకాష్ట..!
- PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!
- Police Officer Death: షాకింగ్.. రోడ్డుపై టపాసులు కాల్చవద్దన్నందుకు పోలీసు అధికారి హత్య..
దోసకాయ, పసుపు అనే సరకుల పేరుతో తొండి, ఎస్పీ పట్నం, దేవీపట్నం సహా పలు ప్రాంతాల నుంచి శ్రీలంకకు గంజాయి తరిలిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. శ్రీలంకకు వెళ్లే బోట్ల కదలికపైనా నిఘా పెట్టారు. తీర ప్రాంతాల్లోని రొయ్యల పామ్స్‌లో సోదాలు జరిపారు. తొండి నుంచి శ్రీలంకకు తరలించాల్సిన డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుని రామనాథపురం కస్టమ్స్ ఆఫీస్‌కి తరలించారు. రొయ్యల ఫాం ఓనర్ కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ అంశంపై విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Telangana Egg Donation Scam : రూ.30 వేల ఆశ చూపించి.. 50 మంది యువతుల జీవితాలతో ఆటలు
-
YS Jagan: రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు..! ప్రజాస్వామ్యం గురించి నీతులా? జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Who Is Alice Huang: ఎవరీ ఆలిస్ హువాంగ్? ఎన్విడియా బాస్‌నే బుట్టలో వేసుకున్న చైనా మిస్టరీ ఉమెన్!
-
Athulya Chandra: హీరోయిన్ అతుల్య చంద్ర కేసులో షాకింగ్ ట్విస్ట్.. అడ్డంగా బుక్కైన కీచక డాక్టర్ విదేశాలకు పరార్!
-
Perni Nani: పులివెందులలో గెలిచింది ఇలాగేనా..? టీడీపీ అరాచకానికి పరాకాష్ట..!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!