వైసీపీ 13 వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల కోసం వైసీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని జగన్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మేనిఫెస్టోతో ఓటర్లను ఆకర్షించిన జగన్ ఈ సారి అందులో ఏం పెట్టబోతున్నరాన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీ సూపర్ సిక్స్‌కు పోటీగా జగన్ మేనిఫెస్టో ఉండనుంది. రైతులు, మహిళలు టార్గెట్‌గా కొత్త పథకాలు ఉండనున్నాయి. ఏపీ ఎన్నికలపై తెలంగాణ పథకాల ప్రభావం పడింది. ఈసారి ఎక్కువగా ఉచిత హామీల ఫై జగన్ దృష్టి పెట్టారని తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఉచిత హామీలే కావడం తో జగన్ కూడా అదే బాటలో పయనించబోతున్నారు. ఇదిలా ఉంటే.. మొన్న జరిగి అద్దంకిలో జరిగిన సిద్ధం సభలో మేనిఫెస్టో ఫై జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పరిగణిస్తామని.. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని.. నెరవేర్చగల హామీలను మాత్రమే ఇస్తామన్నారు. ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని జగన్ ధీమా వ్యక్తం చేశారు. మరి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో చూడాలి.
PM Modi : రూ.1200కోట్ల వ్యయంతో సబర్మతి ఆశ్రమ పునరుద్ధరణ.. నేడు శంకుస్థాపన చేయనున్న మోడీ