ఎలక్టోరల్ బాండ్ల పథకంపై విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కవితపై ఈడీ రైడ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ అని అన్నారు. తాము రెండు సంవత్సరాల క్రితమే కవిత అరెస్టు అవుతుందని చెప్పామని తెలిపారు. మనీష్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడే కవిత అరెస్టు కావాలి.. కానీ అప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కవిత అరెస్టుతో వచ్చే సానుభూతితో మూడు నాలుగు సీట్లు సంపాదించవచ్చని…
ఎలక్టోరల్ బాండ్లను మొదటి నుంచి తాము వ్యతిరేకించినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ తెలిపారు. రాజకీయాలను ధ్వంసం చేసేందుకే ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఎస్బీఐ వ్యవహారశైలి సరిగా లేదు.. ఎస్బీఐ దగ్గర వివరాలు అందించే టెక్నాలజీ లేదా ? అని ప్రశ్నించారు. సమయం లేదు అని దొంగలను కాపాడేందుకే ఎస్బీఐ వివరాలు సరిగా ఇవ్వలేదని విమర్శించారు. ఏ పార్టీకి ఇచ్చారో సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఎవరెవరికి, పార్టీలకు ఎంత ఇచ్చారో…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు మహానటులు..ఒకరిని మించి మరొకరు తమ నటనతో బనగానపల్లె ప్రజలకు మాంచి యాక్షన్ కామెడీ సినిమా చూపించారని, తమ అసమర్థతను తామే ఘనంగా చాటి చెప్పుకున్నందుకు ధన్యవాదాలు అని బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లు మంత్రిగా ఉండి అధికార దాహంతో అక్రమంగా సంపాదించుకున్న అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో హస్తం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు నివాసం వద్ద మాజీ మంత్రిని చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం డీసీసీ…
టైటానిక్.. ఇప్పటి తరాలు ఆ షిప్‌ను చూడకపోయినా అందరికీ తెలిసిన పదమే.. టైటానిక్ చిత్రాన్ని చూసి ఎంతో మంది ఆ పడవ వృత్తాంతం గురంచి తెలుసుకున్న వాళ్లు ఉంటారు. సముద్రంలో మునిగి దశాబ్దాలవుతున్నా అందరికీ ఇంకా గుర్తే. కారణం టైటానిక్ నేపధ్యంలో తీసిన సినిమా. పదేళ్ల క్రితం ఓ కోటీశ్వరుడు టైటానిక్ 2 దింపుతానని ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. లండన్‌లో రిట్జ్ హోటల్లో అపర కోటీశ్వరుడు క్లైవ్ పామర్ చేసిన ప్రకటన ఇది. ఇప్పుడు మరోసారి టైటానిక్…
హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో పోలీస్ హై అలర్ట్ నిర్వహించారు. ప్రధాని మోడీ ఈరోజు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ విజయ సంకల్ప రోడ్ షో చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ భద్రత నిర్వహించనున్నారు. మల్కాజ్‌గిరిలో మోడీ రోడ్ షో 1.3 కిలోమీటర్, గంట పాటు సాగనుంది. అందుకోసమని.. రెండు వేలకు పైగా10 అంచెల పోలీస్ భారీ భద్రత చేపట్టనున్నారు.
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ చబ్బేవాల్ తక్షణమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అనంతరం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తుంది. ఈడీ అధికారులతో కలిసి ఐటీ సోదాలు చేపట్టింది. కవిత నివాసంలో నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కవిత నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఎలక్టోరల్ బాండ్లపై దేశంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ విషయంలో సుప్రీంకోర్టు కఠినమైన తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ని జాబితాలను బహిరంగపరచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల తర్వాత, ఎన్నికల విరాళాలు ఇచ్చే కంపెనీల జాబితా, స్వీకరించే పార్టీల విరాళాల జాబితాను ఎన్నికల సంఘం బహిరంగపరిచింది.