ప్రస్తుతం శిశు మరణాలు తగ్గుముఖం పట్టిందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2030 నాటికి శిశు మరణాలను మరింత తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ఐక్యరాజ్య సమితి యొక్క తాజా నివేదిక ప్రకారం.. 2022 ఐదేళ్లలో మరణిస్తున్న పిల్లల సంఖ్య వయస్సు ముందు ప్రపంచవ్యాప్తంగా 49 లక్షల కనిష్ట స్థాయికి చేరుకుంది.
మచిలీపట్నంలో అర్థరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దొంగ పట్టాలు సిద్దం చేస్తున్నారని రెవెన్యూ సిబ్బందిని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పట్టుకున్నారు. అయితే.. అవి దొంగ పట్టాలు కాదని పెండింగ్ లో ఉన్న పట్టాలకు సంబంధించి వర్క్ చేస్తున్నామని రెవెన్యూ సిబ్బంది వెల్లడించారు. దీంతో.. కొల్లు రవీంద్ర సహా పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మార్వో సతీష్. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మరో 24 గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల…
థర్డ్ పార్టీ యూపీఏ ఉపయోగించేందుకు ఆమోదం పొందిన పేటీఎం Paytm వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుండి గురువారం రిలీఫ్ న్యూస్ వచ్చింది. మార్చి 15 తర్వాత విజయ్ శేఖర్ శర్మ కంపెనీ Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిమితులు వర్తిస్తాయి. అయితే దీనికి ముందు NCPI Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్ లిమిటెడ్‌కు మూడవ పార్టీ UPI అప్లికేషన్‌ను ఉపయోగించడానికి అనుమతిని ఇచ్చింది. మల్టీ…
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో ఎంపీ మార్గాని భరత్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. రాజమండ్రిలో ఇవాళ ఒకేరోజు 25వేల ఇళ్ల పట్టాల పంపిణీ చేసి చరిత్ర సృష్టించామన్నారు. సీఎం జగన్ ఒకేరోజు 25వేల ఇళ్ల పట్టాల కోసమని 300 కోట్లు విడుదల చేశారన్నారు మార్గాని భరత్. ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లకపోతే రాజమండ్రిలో పట్టాల…
నేడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నిన్న రాత్రి ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకున్నారు. ఈరోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటి వరకూ ఆయన కాపు సామాజికవర్గం సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలకూ దూరంగా ఉన్నారు. అయితే ఈరోజు ఆయన వైసీపీలో చేరుతుండటంతో సుదీర్ఘకాలం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి…
నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన. నేడు మల్కాజ్గిరి లోక్‌సభ పరిధిలో ప్రధాని మోడీ రోడ్ షో. మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి క్రాస్ వరకు ప్రధాని రోడ్ షో. తిరుపతిలో కొనసాగుతున్న లోకల్, నాన్లోకల్వార్. తిరుపతి సీటుకు నేడు నగరంలో ఆత్మగౌరవ సభ. అభ్యర్థి ఆరిణి శ్రీనివాసులను మార్చే వరకు పోరాటం తప్పదంటున్న టీడీపీ, జనసేన నేతలు. టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ నేతలు సైతం హాజరుకానున్నట్లు సమాచారం. గోబ్యాక్ ఆరిణి అంటూ నగరంలో వెలసిన…
హైదరాబాద్ శిల్పారామం పక్కన నిరుపయోగంగా ఉన్న స్టాల్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. 2017 నుంచి నిరుపయోగంగా ఉన్న నైట్ బజార్ లోని 119 స్టాల్స్ ను ఇందుకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు బజార్ లా స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేలా స్టాల్స్…
రాష్ట్రాన్ని వైసీపీ కబంద హస్తాల నుంచి కాపాడాలంటే అది టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు . విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని గురువారం యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు.
ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో స్పల్పంగా భూప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, ఓజిలి, దొరవారిసత్రం, పెళ్లకూరు మండలాలలో స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ అంజిలప్ప, ఏడీ కృష్ణయ్యలను అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ స్కామ్ లో నలుగురు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.