బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారికంగా ప్రకటించింది. సెక్షన్ 19, Pmla act కింద ఈడీ అరెస్ట్ చేశారు. కవిత నివాసం నుంచి మూడు వాహనాల్లో కవితను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. దుర్గంచెరువు మీదుగా శంషాబాద్ కి ఈడీ తీసుకెళ్తున్నారు. అంతకుముందు కవిత ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కార్యకర్తలకు, అభిమానులకు నినాదాలు చేశారు. ఇలాంటి అణిచివేతలు ఎన్ని…
కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల కేసును డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) కర్ణాటక అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలోని సీఐడీకి అప్పగించారు. తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బీఎస్ యడ్యూరప్పపై ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో కవిత ఇంటికి కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం తమ న్యాయవాదినైనా అనుమతించాలి కదా అని వాదించారు. అధికారులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.
భారత్లో అమలవుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అమెరికా గాయని మేరీ మిల్బెన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. విశ్వాసం కారణంగా చిత్రహింసలకు గురైన ప్రజల పట్ల ప్రధాని మోడీ దయతో కూడిన దృక్పథాన్ని అవలంబిస్తున్నారని, వారికి భారత్లో నివాసం కల్పిస్తున్నారన్నారు.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు సుమారు 3 గంటలకుపైగా తనిఖీలు చేసిన అనంతరం.. అరెస్ట్ చేశారు. కాగా.. కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. మరోవైపు ఈడీ సోదాల్లో భాగంగా.. కవిత రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.
దేశంలో రాజకీయాలను నేరపూరితం చేయకూడదనే సంకల్పంతో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అందుకు భరోసా ఇస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారు అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నారని ఆయన తెలిపారు. కోయిల్రాలో ఉన్న మా పటేశ్వరి దేవి స్టేట్ యూనివర్శిటీ భూమి పూజ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడారు.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు సుమారు 3 గంటలకుపైగా తనిఖీలు చేసి.. కవితను అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో భాగంగా.. కవిత రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులు మూడు గంటలకుపైగా సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు వచ్చారని తెలుసుకున్న కవిత తరఫు న్యాయవాది సోమా భరత్ ఆమె ఇంటికి వచ్చారు. అయితే ఈడీ అధికారులు ఆయనను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో సోమ భరత్ కుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీ నుండి ఈడీ అధికారులు ఇలా రావడం కరెక్ట్ కాదన్నారు. సుప్రీంకోర్టులో కవిత కేసు పెండింగ్ ఉంది.. పెండింగ్ లో కేసు ఉండగా ఈడీ అధికారులు…
ఏడాది క్రితం అకాల వర్షాలతో తడిచిన ధాన్యం విక్రయాల్లో పౌరసరఫరాల శాఖకు రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టం వాటిల్లేలా గత ప్రభుత్వం ప్రయత్నించింది. మెట్రిక్ టన్నుకు రూ.3 వేలకుపైగా తక్కువకు టెండర్ కట్టబెట్టినా.. కొనుగోలుదారులు ఆ మొత్తం కూడా చెల్లించేందుకు ఇష్టపడలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేశారు. తాజాగా పిలిచిన టెండర్లలో గతం కన్నా ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.3 వేలు అదనంగా టెండర్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన పౌరసరఫరాల…