S Jaishankar: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం అనేక సమస్యలలో పాలుపంచుకుంది. ఆ దేశాల్లో నిరంతరం ఉద్రిక్తతలను తగ్గించడంలో నిమగ్నమై ఉంది. ఇజ్రాయెల్‌పై రష్యా అణు దాడిని ప్రధాని నరేంద్ర మోడీ నివారించారా? అనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమాధానమిచ్చారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో జైశంకర్ మాట్లాడుతూ.. యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ అనేక సందర్భాల్లో ఘర్షణలను నివారించడానికి ప్రయత్నం చేసిందన్నారు. ప్రపంచం ఈ సంఘర్షణ ముగియాలని కోరుకుంటుందన్నారు. ఈ సమయంలో అత్యంత తెలివైన విషయం ఏమిటంటే, కనీసం ఒక సమస్యను పరిష్కరించడంలో సహాయం చేయడం లేదా ఒక టెన్షన్‌ను తగ్గించడం పెద్ద పని అని పేర్కొన్నారు. ఈ చర్చలు చాలా జరిగాయని.. అణు దాడి గురించి నేరుగా ప్రస్తావించకుండా మంత్రి అన్నారు.
Read Also: Petrol Price Reduce: మోడీ సర్కార్ గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు రూ.15 తగ్గింపు.. ఎక్కడంటే?
ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కలిగి ఉన్న ఒక బాధ్యతాయుతమైన దేశం ఏం చేస్తుందో అదే తాము చేస్తు్న్నామని ఆయన అన్నారు. అణు దాడిని నివారించడం గురించి ప్రత్యేకంగా పదేపదే అడిగిన ప్రశ్నకు, “ఉద్రిక్తతను తగ్గించడానికి, విషయాలను మరింత దిగజార్చని సంఘటనలను నివారించడానికి మేము నిరంతరంగా చేస్తున్నాము” అని కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు. ఉక్రెయిన్‌పై అణుదాడి చేయకుండారష్యాను నిరోధించడంలో వివిధ దేశాల దౌత్య ప్రయత్నాలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారని ఇటీవలి నివేదిక పేర్కొంది.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. భారతదేశ విదేశాంగ విధానాన్ని సరిదిద్దడానికి తనకు డబ్బు చెల్లిస్తారని.. సోషల్ మీడియాలో పోస్టుల చేసినందుకు కాదని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ఏమైనా ఉంటే వాటిని ఎలా పరిష్కరిస్తారని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.