MLC Balmuri Venkat : అనుములకి ఎనుములకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అనుములకి ఎనుములకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిత్రపురి సొసైటీలో జరిగిన అవినీతికి సీఎం రేవంత్ రెడ్డికి ఏంటి సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడైనా రేవంత్ సోదరులో మహేంద్ర రెడ్డి అనే పేరు విన్నారా..? అని ఆయన ప్రశ్నించారు. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి తప్పకుండా వారిపై మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నిజంగా తప్పు చేస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదన్నారు. కానీ అనవసరంగా కావాలని ఆరోపణలు చేస్తే చూస్తూ ఉరుకోమని, బీఆర్ఎస్ కి చిత్తశుద్ధి ఉంటే మిరే కదా గతంలో ప్రభుత్వం ఉంది మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు..? అని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా..’అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు మేము ఏమి చేయలేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. గతంలో మీడియా ను ,సోషల్ మీడియా ను బీఆర్ఎస్ కేసీఆర్ ఎలా అణిచివేశారో అందరికి తెలుసు. హుజురాబాద్ లో నా ఫోన్ తీసుకొని కేస్ పెట్టింది మర్చిపోయారు. పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరిన మిర్చి రైతులకు సంకెళ్లు వేసిన సంఘటన అప్పుడే మర్చిపోయారా.. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపుతారని ధర్నా చౌక్ ఎత్తేసిన్నపుడు మాట్లాడని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఇంట్లోకి వచ్చి అరెస్ట్ లు చేసిన సంఘటనలు మర్చిపోయారా.. నేను మాజీ సీఎం కేసీఆర్ గారి పుట్టిన రోజు చేస్తే.ఒక గాడిదకు ఫోటో వేస్తే గడిగా దొంగతనం జరిగిందని సుమోటోగా కేసులు పెట్టారు. నేను చేసిన కార్యక్రమం ఒకదగ్గరైతే సుమోటోగా రెండు చోట్లా కేసులు పెట్టారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా ఒక అధికారి ఇంటిపై రూమ్ లో లాక్ చేసి పెట్టారు. ఈ రోజు మీ పోస్ట్ పై ఫిర్యాదు చేస్తూ పోలీసులు వారిపని వారు చేశారు. మాది ప్రజా ప్రభుత్వం మీ బీఆర్ఎస్‌ల కాదు.. తప్పు చేసింది ఎవరైనా ఉరుకొము. కానీ ఆధారాలతో రండి ఊరికే బురదజల్లే ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఉరుకొము.
Also Read
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
మేము బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ లుగా ఉన్నాము ఏమైనా మాట్లాడొచ్చు అంటే కుదరదు… లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఉరుకోదు తనపని తను చేసుకుపోతుంది. భజనలు చేయడం మానుకోండి. అనవసరంగా మా సీఎం గారి పై లేనిపోని ఆరోపణలు చేస్తే వదిలిపెట్టము. క్రిశాంక్ అన్న మీరు ఎప్పుడు మాలగా చెప్పలేదు. నేను మీడియా ముందు చెప్తున్నాను ఆధారాలు తీసుకొని అమరవీరుల స్థూపం వద్దకు రండి. డీజీపీ ఆఫీస్ కు వెళ్దాం..ఎవరు తప్పు చేసిన చర్యలు తీసుకుంటారు. క్రిశాంక్ అన్న కాంగ్రెస్ లో ఉన్నపుడు ఇద్దరం కలిసి ఉద్యమాలు చేస్తే ఇద్దరి పై కేసులు పెట్టిన విషయం మర్చిపోయారా.. అవస్తవాలు చెప్పడం మానుకోండి.. మీరు కేటీఆర్ ,కవిత ఆ కుటుంబం మెప్పు పొందలనుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఎలాంటి అభివృద్ధి జరుగాకపోయి జరిగిందని చెప్పుకోండి. మీకు కావాల్సిన ఎమ్మెల్యే టికెట్ కోసం ఇలా మా ప్రభుత్వం పై అవస్తవాలు మాట్లాడడం మానుకోండి. కానీ మా సీఎం గారికి పై అనవసరంగా ఆరోపణలు చేయకండి. ఇలా అనవసరమైన ఆరోపణలు సోషల్ మీడియా లో చేస్తే ప్రభుత్వం తన పని తాను చేసుకొనిపోతుంది.’ అని బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు