బీఆర్ఎస్ పై పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. పదేళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సీపీఐ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా..? అని మండిపడ్డారు. తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో శాసనసభ్యులను చేర్చుకున్నది మీరు కాదా..? పదేళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39…
హైదరాబాద్ పాతబస్తీ మీర్చౌక్ ఆఘా కాలనీలో దారుణ హత్య కలకలం రేపుతోంది. ఓ ఇంట్లో షేక్ వాజిద్ అనే వ్యక్తిని నిసార్ అహ్మద్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య, మీర్ చౌక్ ఏసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. హత్యకు గల కారణాలు ఆర్థిక లావాదేవీలే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైంది. ఎన్నికల తేదీ ఆలస్యమవడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు.
కర్ణాటకలో 14 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన పర్సులోని రూ.2 వేలు దొంగిలించిందని టీచర్ అనుమానించి వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పాఠశాలలో జరిగిన సంఘటనల కారణంగానే బాలిక ఈ దారుణానికి ఒడిగట్టిందని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022లో తమ కూటమి అధికారంలోకి రావడానికి కారణం రెండు పార్టీల్లో చీలికని స్పష్టం చేశారు. ఆ చీలిక జరగడం వల్ల తనకు ఇద్దరు మిత్రులు లభించారని వివరించారు.
ఎలక్టోరల్ బాండ్ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కఠినంగా వ్యవహరించింది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారం ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎందుకు పూర్తి నంబర్లు ఇవ్వలేదు.. ఎలక్టోరల్ బాండ్ కేసులో ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకోవాలంటే కప్పలకు పెళ్లి చేయడం, విందు భోజనం ఏర్పాటు చేయడం లాంటివి చేస్తారు. ఇక, వర్షాల కోసం వరుణయాగం, కబడ్డీ ఆటలు, పాటలు పాడటం చేస్తారు. తాజాగా అస్సాంలోని బిస్వనాథ్ జిల్లాలో ఆదర్శ గోరెహగి గ్రామంలోని స్థానికులు వరుణ దేవుడి కటాక్షాన్ని పొందడానికి పురాతన మార్గాలను ఆశ్రయించారు.
యూపీలోని బర్సానాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం రాధారాణి ఆలయంలో నిర్వహించిన ముందస్తు హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలోని మెట్ల రెయిలింగ్ విరిగిపడటంతో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడినట్లు ఆలయ అధికారులు సోమవారం తెలిపారు.