తెలంగాణ ప్రజలనుద్దేశించి మాజీ గవర్నర్ తమిళిసై ఓ సందేశం ఇచ్చారు. నా ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా.. నేను తెలంగాణ గవర్నర్ పదవి నుంచి వైదొలగుతున్నప్పుడు, అనేక భావోద్వేగాలతో మునిగిపోయాను. ఈ అద్భుతమైన రాష్ట్రానికి సేవ చేయడం చాలా ఆనందం కలిగించింది. అన్నింటికీ మించి తెలంగాణాలోని నా సోదర సోదరీమణుల ఆప్యాయత నన్ను బాగా ఆకట్టుకుందని తెలిపారు.
తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ క్రమంలో.. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లను కలిశారు. కాగా.. కాంగ్రెస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు తాటికొండ రాజయ్య. కాగా.. తాటికొండ రాజయ్య ఈ మధ్యే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..
దేశంలో పెరుగుతున్న ఆటిజం కేసుల దృష్ట్యా.. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ (ASD) ద్వారా ప్రభావితమవుతున్న నేపథ్యంలో.. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మార్చి 16, 17 తేదీలలో హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు ‘ఆటిజం ఒడిస్సీ’ పేరిట జాతీయ సదస్సును నిర్వహించింది. బంజారా హిల్స్ రోడ్ నెం. 2లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బంజారా హిల్స్ రోడ్ నెం. 10లోని రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ ఈ మహోన్నత కార్యక్రమానికి వేదికగా నిలిచాయి.…
ప్రధాని మోడీ జగిత్యాల పర్యటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి ఎన్నికల కార్యక్రమంలో దేశ అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాల గురించి వివరించాలని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ కి ఏ గతి పట్టిందో.. దేశంలో కూడా మోడీకి అదే గతి పడుతుందని ఆరోపించారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అకౌంట్ కూడా ఓపెన్ కాదని విమర్శించారు. కేసీఆర్ గారడీ చేసినట్టే మోడీ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీన కవితను అరెస్ట్ చేశామని.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపింది.
తీర్థయాత్రల కోసమని బయల్దేరిన పండితులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దేవుడిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని భావించినా వారు.. డైరెక్టుగా దేవుడి దగ్గరికే వెళ్లారు. ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు పండితులు మరణించారు.
క్షిణ మధ్య రైల్వే కాజీపేట-బళ్లార్ష విద్యుద్దీరణ ప్రాజెక్టులో భాగంగా.. ఆసిఫాబాద్- రేచిని రోడ్డు మధ్య 19 కిలోమీటర్ల దూరం వరకు విద్యుద్దీకరణతో పాటు మూడవ రైల్వే లైన్ పనులను పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకొనివచ్చింది. గ్రాండ్ ట్రంక్ మార్గంలోని కాజీపేట-బళ్లార్ష మధ్య ఉన్న ఈ సెక్షన్.. దేశంలోని ఉత్తర ప్రాంతాన్ని దక్షిణ ప్రాంతంతో అనుసంధానించే కీలకమైన రైలు మార్గం. ఈ కీలకమైన ప్రాజెక్టులో ఇప్పటివరకు మొత్తం 151 కిలోమీటర్ల మేర పనులు పూర్తిచేశారు. గతంలో పూర్తిచేయబడిన రాఘవాపురం-మందమర్రి…
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మాజీ గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తునందుకు బాధగా ఉంది.. కానీ తప్పడం లేదన్నారు. తెలంగాణ ప్రజలందరు నా అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ళు అని పేర్కొన్నారు. ఎప్పుడు తెలంగాణ ప్రజలను మరువను.. అందరితో కలుస్తూ ఉంటానని తెలిపారు. మరోవైపు.. తమిళనాడులో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమో దాటవేస్తూ వెళ్ళిపోయారు.
రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నిన్న రాహుల్ న్యాయ్ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. అటు నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ, సీఈసీ మీటింగ్ లో పాల్గొననున్నారు.
జితేందర్ రెడ్డి పార్టీ మార్పుపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించి... పార్టీకి సిద్దాంతం లేదని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కొడుక్కి సీటు ఇస్తే సిద్దాంతం ఉన్న పార్టీ.. నీకు సీటు ఇవ్వక పోతే సిద్దాంతం లేదా అని ప్రశ్నించారు. ఏ ఆర్థిక ప్రయోజనాలు కోసం మీరు పార్టీ మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బంధువులు కంపెనీ అమ్ముతున్న ఫ్లాట్స్ ఏమీ.. చేవెళ్ల పార్లమెంట్ ఎంపీతో…