పాకిస్తాన్ క్రికెట్ జట్లులో భారీ మార్పులు చేర్పులు చేస్తున్నారు. మళ్లీ బాబర్ అజాంను మళ్లీ టీ20 కెప్టెన్ గా ప్రకటించారు. ఇంతకుముందు.. బాబర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత.. షాహిన్ ఆఫ్రిదికి బాధ్యతలు అప్పగించారు. తన కెప్టెన్సీలో అనుకున్నంత విజయాలను సాధించకపోవడంతో బాబర్ కే పగ్గాలు అప్పజెప్పింది. ఇదిలా ఉంటే.. జట్టు హెడ్ కోచ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎంతో ఎదురుచూస్తుంది. ఇంతకుముందు కోచ్ పదవుల్లో ఉన్న మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, ఆండ్రూ పుతిక్‌లను లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) కి ట్రాన్స్‌ఫర్ చేసింది పీసీబీ. దాంతో ప్రధాన కోచ్ పోస్టు ఖాళీగా ఉంది.
Yusuf Pathan: మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ ప్రచారంపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు..
అందుకోసం ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సాన్‌ను కోచ్ పదవి కోసం సంప్రదించింది పీసీబీ. కానీ.. తనకు ఉన్న కామెంటరీ, కోచింగ్ కమిట్‌మెంట్ల కారణంగా వాట్సాన్ సుముఖత చూపలేదు. అతని కంటే ముందు మైక్ హెస్సన్, డారెన్ సామీలను కూడా హెడ్ కోసం సంప్రదించింది. అయితే, వారు కూడా ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు న్యూజిలాండ్ మాజీ ఆటగాడిని ఒప్పించే పనిలో ఉన్నారు.
Viral News: గుర్రపు స్వారీ చేస్తున్న వరుడికి అనుకోని ప్రమాదం.. వీడియో వైరల్
న్యూజిలాండ్ మాజీ ఆటగాడు ల్యూక్ రోంచిని పాకిస్తాన్ హెడ్ కోచ్ గా ఒప్పించేందుకు పీసీబీ ప్రయత్నాలు చేస్తుంది. అతను పాకిస్తాన్ హెడ్ కోచ్ గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని అక్కడి మీడియాలో వార్తలొస్తున్నాయి. అందుకోసం.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పటికే అతడితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రోంచి ప్రస్తుతం కివీస్ సీనియర్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఇతను.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తన క్రికెట్ కెరీర్‌లో న్యూజిలాండ్ తరఫున 4 టెస్టులు, 85 వన్డేలు, 33 టీ20లు ఆడాడు. అలాగే లీగ్ క్రికెట్‌లో భాగంగా పలు దేశాల టోర్నీలలో ఆడాడు.