Mu*rder: బాలాపూర్‌లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో పెట్టిన ప్రియుడు
- బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియురాలి దారుణ హత్య..
- ప్రియురాలిని హత్య చేసినట్లు అహ్మద్
- హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి తరలించే ప్రయత్నం
- మరో ఇద్దరితో కలిసి యువతిపై దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder: హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ప్రియుడు అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. బీహార్‌కు చెందిన ఓ యువతి బాలాపూర్ పరిధిలోని ఫంక్షన్ హాళ్లలో పనిచేస్తోంది. ఆమెకు అహ్మద్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల అహ్మద్ ఆమెను వేధిస్తున్నట్లు సమాచారం. మరోవైపు యువతి ప్రస్తుతం రెండు నెలల గర్భవతి. దీనితో ఆమెను ఎలాగైనా వదిలించుకునేందుకు అహ్మద్ హత్యకు పథకం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు కలిసి యువతిపై దాడి చేసినట్లు సమాచారం. ఆ తర్వాత కత్తితో దారుణంగా హత్య
చేశారు.
Also Read
- BRS MLAs: కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్
- Rohit Sharma: బుల్లితెరపై రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!
- Steel Tap Cleaning Tips: జిడ్డుగా మారిన స్టీల్ ట్యాప్‌ల క్లీనింగ్‌కు బెస్ట్ చిట్కా.. 2 నిమిషాల్లో క్లీనింగ్
- 1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా బాలాపూర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అహ్మద్‌కు అతడి తల్లిదండ్రులు కూడా హత్యకు సహకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనలో ఇతరుల పాత్రపై విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
BRS MLAs: కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్
-
Asian Games Cricket Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3న రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్‌లు!
-
Rohit Sharma: బుల్లితెరపై రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!
-
Steel Tap Cleaning Tips: జిడ్డుగా మారిన స్టీల్ ట్యాప్‌ల క్లీనింగ్‌కు బెస్ట్ చిట్కా.. 2 నిమిషాల్లో క్లీనింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!