ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అందుకోసమని ఇప్పటికే స్టేడియానికి ఇరుజట్ల చేరుకున్నాయి. కాగా.. స్టేడియంకు వెళ్లే ముందు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తెలుగులో మాట్లాడుతూ మేము వచ్చేశాం.. ముంబై ఫ్యాన్స్ పదండి ఉప్పల్ కు అంటూ తెలిపారు. గతంలో కూడా ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా హైదరాబాద్ కు వచ్చినప్పుడు.. ఇలాగే తెలుగులో మాట్లాడి ఫ్యాన్స్ కు జోష్ నింపారు.
కాగా.. ఇరుజట్లు కూడా గెలుపు కోసం ఆరాటపడుతున్నాయి. ఇప్పటికే కేకేఆర్ తో సన్ రైజర్స్, గుజరాత్ తో ముంబై ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలువాలన్న కసితో ఇరుజట్లు చూస్తున్నాయి. అయితే.. సన్ రైజర్స్ హైదరాబాద్ కు హోంగ్రౌండ్ కావున ఆ జట్టు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. మరోవైపు.. ముంబై ఇండియన్స్ కు కూడా ఉప్పల్ స్టేడియంలో మంచి రికార్డు ఉంది.
హైదరాబాద్, ముంబై జట్లు ఇప్పటి వరకు 21 ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి. సన్ రైజర్స్ వాటిలో 9 గెలిచింది మరియు ముంబై 12 గెలిచి ఆధిక్యంలో ఉంది. సొంత మైదానంలో ఆడనుండటంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఫెవరేట్ అని చెప్పాలి. ముంబై టాప్ ఆర్డర్ పవర్ ఫుల్ గా ఉంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (wk), తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా (c) ఉన్నారు. సన్ రైజర్స్ విషయానికి వస్తే.. వీరి ఆటంతా మిడిల్ ఆర్డర్ ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ పైన ఆధారపడి ఉంది. చూడాలి మరీ ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో.