తమ ఫిర్యాదు పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడగానికి వచ్చిన మహిళపై ర్యాష్‌గా మాట్లాడిన కేసులో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ ముగ్గురు బండ్లగూడ పోలీసులపై వేటు విధించారు. బండ్లగూడ ఇన్స్పెక్టర్ షాకీర్ ఆలీతో పాటు ఎస్ఐ వెంకటేశ్వర్, కానిస్టేబుల్ రమేష్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలలోకి వెళితే …చాంద్రాయణగుట్ట సీఆర్పిఎఫ్ క్యాంపస్‌కు చెందిన ముఖ లింగం సీఆర్పిఎఫ్ రిటైర్డ్ జవాన్. ప్రస్తుతం ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ లో ఎస్పిఓగా విధులు నిర్వహిస్తున్నాడు. నెల రోజుల క్రితం ముఖలింగం పార్కు చేసిన కారు ముందు చిత్తుగా మద్యం సేవించిన నలుగురు సీఆర్పిఎఫ్ జవాన్ లు యూర్నల్ చేయడానికి ప్రయత్నించగా అతను అడ్డుకున్నాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. నలుగురు జవాన్లు ముఖలింగంపై దాడి చేశారు. ముఖలింగం కేకలు వేయడంతో అతని భార్య బయటికి వచ్చింది. ఇదేంటని నిలదీసిన అతని భార్యను సైతం జవాన్లు కొట్టారు.
Mohammed Shami: మహ్మద్ షమీని భర్తీ చేయడం కష్టమే: మోహిత్
దీంతో ఆ అవమాన్ని భరించలేక వెంటనే ముఖలింగం దంపతులు బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండ్లగూడ ఇన్స్పెక్టర్ షాకీర్ ఆలీ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించిన బండ్లగూడ పోలీసులు 41 ఎ కింద నోటీసులు జారీ చేశారు. ఇటీవల బండ్లగూడ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ముఖలింగం దంపతులు పెండింగ్‌లో ఉన్న తమ కేసు విషయమై బండ్లగూడ ఇన్స్పెక్టర్ షాకీర్ ఆలీ, ఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ రమేష్లను ఆరాదీశారు. దీంతో బండ్లగూడ పోలీసులు ఆ దంపతులపై ర్యాష్‌గా మాట్లాడారు. దీంతో ముఖలింగం భార్య ఇన్ స్పెక్టర్, ఎస్ఐ, కానిస్టేబుల్ మాటలను తెలివిగా రికార్డింగ్ చేసింది. ఆ వాయిస్ రికార్డింగ్లను ముఖలింగం దంపతులు కొత్త కోట కమిషనర్ శ్రీనివాస్ కు వినిపించినట్లు సమాచారం. దీంతో పోలీస్ బాస్ ఫ్రెండ్లీ పోలీస్ విలువలు దిగజారుస్తున్నారని, ఫిర్యాదు దారులపై అనుసరించాల్సిన పద్దతి ఇది కాదని బండ్లగూడ ఇన్స్పెక్టర్ షాకీర్ ఆలీ, ఎస్ఐ వెంకటేశ్వర్, కానిస్టేబుల్ రమేష్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.