మహిళా ఫిర్యాదురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా తన భర్త గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఇక, అదే పోలీస్ స్టేషన్ లో సస్పెండ్ కు గురైనా ఏఎస్ఐ వి. రామయ్య కూడా విధులు నిర్వహిస్తుండంతో సదరు బాధిత మహిళా బాధితురాలితో పరిచయం పెరిగింది. బాధితురాలికి తగిన న్యాయం చేస్తానని ఆమెను నమ్మించి బాధిత మహిళతో పరిచయం పెంచుకోవడంతో పాటు సదరు మహిళ ఫోన్ నంబర్ తీసుకోని గంటల తరబడి ఫోన్లో మాట్లాడం కూడా చేసుకున్నారు. ఇక, ఆమెతో ఏఎస్ఐ రామయ్య అక్రమ సంబంధం కొనసాగించడంతో తాను బందోబస్తూ విధులు నిర్వహించే ప్రదేశానికి సదరును పిలిపించుకొని పరిసర ప్రాంతాల్లో మహిళతో ఏకాంతంగా గడిపేవాడు.
Read Also: Gaami OTT : ఓటీటీలోకి రాబోతున్న విశ్వక్ సేన్ హిట్ మూవీ.. ఎప్పుడు స్ట్రీమింగంటే?
ఇక, ఏఎస్ఐ రామయ్య అక్రమ సంబంధం గురించి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. దీంతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళతో ఎఫైర్ పెట్టున్నట్లు ఆరోపణలు చేస్తూ వాట్సాప్ గ్రూప్స్ లో బాగా వైరల్ అయింది. ఇక, విషయం తెలుసుకున్న మల్టీ జోన్ 1 ఐజీ ఏవీ రంగనాథ్.. ఈ ఆరోపణలపై విచారణ చేయించారు. అసలు విషయం బయటకు రావడంతో ఏఎస్ఐ రామయ్యను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.