వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయి రెడ్డిపై విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్ది బ్రోకర్, ఆర్ధిక ఉగ్రవాది అని విరుచుకుపడ్డారు. రాజశేఖర్ రెడ్ది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోపిడీలో ముద్దాయి సాయిరెడ్డి.. అందుకే జైలుకి వెళ్లారని ఆరోపించారు. సాయిరెడ్డికి వ్యాపారాలు లేవంటే నెల్లూరు ప్రజలు నమ్మరు.. వారి చెవ్వుల్లో పువ్వులు లేవని వ్యాఖ్యానించారు. వేణుంబాక ఫౌండేషన్ 13 ఏళ్లలో రూపాయి కూడా ఖర్చు…
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షల ఎకరాల్లో పంటలకు నష్ట వాటిల్లింది. అయితే.. ఈ నేపథ్యంలోనే రంగంలోకి గులాబి బాస్ దిగనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాతల చెంతకు కేసీఆర్ రానున్నారని, ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో కేసీఆర్ పర్యటిస్తారని ఆయన తెలిపారు. Prakash…
కచ్చితంగా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన సంగారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో మెదక్ నుంచి పోటీ చేద్దామని సర్వేలు చేసుకుని BRS గెలుస్తుందని తెలిసి వెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి రఘునందన్ పనిమంతుడు అయితే దుబ్బాకలో గెలిచేవాడు కదా అని ఆయన సెటైర్లు వేశారు. ముస్లింలకు కాంగ్రెస్ కేబినెట్లో మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ఆయన…
టెలికాం సేవలందిస్తున్న కంపెనీలు తమ వినియోగదారులపై మరోసారి భారం మోపడానికి రెడీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల తర్వాత టారిఫ్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
పాకిస్తాన్లోని రెండవ అతి పెద్ద నౌకాదళ ఎయిర్ స్టేషన్పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడికి దిగింది. పాక్ మీడియాకు అందిన సమాచారం ప్రకారం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడి చేసినట్లు తెలుస్తుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ తన మొదటి గెలుపును నమోదు చేసింది. 4 వికెట్ల తేడాతో పంజాబ్ పై బెంగళూరు విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది. చివరలో దినేష్ కార్తీక్ కేవలం 10 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. అతనితో పాటు మహిపాల్ లోమ్రార్ కూడా కేవలం 8 బంతుల్లో…
టీ 20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు సాధించారు. టీ20ల్లో అత్యధికంగా 50 ప్లస్ రన్స్ చేసిన తొలి టీమిండియా క్రికెటర్ గా రికార్డ్ సృష్టించారు. ఈరోజు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశారు. అంతేకాకుండా.. ఈ మ్యాచ్ లోనే అత్యధిక క్యాచ్ లు (173) అందుకున్న భారత ఆటగాడిగాను అవతరించారు. బెయిర్ స్టో ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో ఈ ఘనత సాధించాడు. ఇదే మ్యాచ్ లో కోహ్లీ…
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్-రాయల్స్ ఛాలెంజర్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆర్సీబీ లక్ష్యం 177 పరుగులు చేయాల్సి ఉంది. పంజాబ్ బ్యాటింగ్ లో శిఖర్ ధావన్ (45) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత జానీ బెయిర్ స్టో (8) అనుకున్నంత రాణించలేకపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ప్రభ్ సిమ్రాన్…