కేసీఆర్ గొప్ప నాయకుడని ఆయన పక్కన ఉన్న వాళ్లే కేసీఆర్ ను బ్రష్టు పట్టించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంట్ కి వెళ్తానని దానం అన్నారు. తన అభ్యర్థిత్వం పై కేటీఆర్ న్యాయస్థానానికి వెళితే తాను న్యాయస్థానంలోనే సమాధానం చెప్తానని అన్నారు. వాళ్లు చేసింది సభబైతే ఇప్పుడు జరుగుతున్నది సబబేనని అన్నారు. ముఖ్యమంత్రిపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని మూడు నెలల్లో ముఖ్యమంత్రి 3500 కోట్లు సంపాదిస్తే పది సంవత్సరాల…
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డిలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆర్ధిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన CFMS వ్యవస్థను నాశనం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన CFMSను ముఖ్యమంత్రి కార్యాలయం ఆధీనంలోకి తీసుకుంది.. సత్యనారాయణ, ధనుంజయ్ రెడ్డిలు ఇద్దరూ కలిసి నిధులను దారి మళ్లిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా వైసీపీకి మద్దతుగా నిలిచే…
నాపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమే తనపై వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొట్టిపారేశారు, తనపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. తనను అనవసరంగా తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ నుంచి మారాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, అయితే తనకు అలాంటి ఆలోచనే లేదని చెప్పారు. 2023 ఆగస్టులో తనను అక్రమంగా నిర్బంధించి, దాడి చేసి డబ్బులు వసూలు చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు,…
వివిధ పార్టీల నేతలతో ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా భేటీ అయ్యారు. పార్టీలు అనుసరించాల్సిన నిబంధనలపై చర్చించారు. ఎన్నికల కోడ్ అమలు, ఎన్నికల సాఫీ నిర్వహణపై పార్టీలతో ఏపీ సీఈఓ చర్చించారు. మీటింగ్ అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఉన్న అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అభ్యర్థి ఇంటింటి ప్రచారానికి అనుమతి తీసుకోవాలనడం సరైంది కాదని పేర్కొన్నారు. దేశంలోని ఏ…
నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కయ్యాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టండని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశమంతా మోడీ గాలి వీస్తోందని, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ మధ్యే ఎన్నికల వార్ అని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం మోడీ ప్రభుత్వమే కొనసాగాలనుకుంటున్నారని, రాష్ట్రంలో ఖజానా ఖాళీ.. జీతాలకు డబ్బులిచ్చే పరిస్థితి లేదని ఆయన…
మన అభివృద్ధి కొనసాగాలంటే జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని కోరారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. పేద వర్గాలను ఓట్ల కోసమే గత పాలకులు చూశారు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటు పడిన ఒకే ఒక్కడు జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. తాను 50 ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు చేశానని.. అడగకుండానే పేద వర్గాలకు సంక్షేమాన్ని…
నగరంలోని సెల్ఫోన్ టవర్లపై పరికరాలను చోరీ చేస్తున్న నిందితుల అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ మీడియా తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టవర్లకు ఉండే రేడియో రిమోట్ యూనిట్లు, హెడ్స్ చోరీ చేస్తున్నారని, ఈ పరికరాలు మొబైల్ టవర్స్ లో వాడతారు.. మొబైల్ సిగ్నల్స్ అందడానికి ఈ పరికరాలు అత్యవసరమని ఆమె తెలిపారు. అయితే.. సౌత్ జోన్ టాస్క్ఫోర్స్, కాచిగూడ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు…
పార్టీ నిర్వహణ అవసరాలకు రూ.10 కోట్ల విరాళాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ ఉన్నతి కోసం మొదటి నుంచి తన స్వార్జితాన్ని పార్టీ కోసం వెచ్చిస్తూ వస్తున్న పవన్ కల్యాణ్.. ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్వహణ కోసం మరోసారి భారీ విరాళాన్ని అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నంకు విరాళం చెక్కులను అందజేశారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో ఇప్పటికే ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీదున్నాయి. ఇదిలా ఉంటే.. గత సీజన్ లో చెన్నై, గుజరాత్ మధ్య ఫైనల్ పోరు జరిగింది. ఆ మ్యాచ్ లో చెన్నై ఉత్కంఠ…
రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, ముంబై మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఏర్పాట్లు, బందోబస్తు పై రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ.. 2500 మంది పోలీసులతో స్టేడియం చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్టేడియం చుట్టూ 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, స్టేడియం లోపల కంట్రోల్ రూం ఏర్పాటు.. ప్రత్యేక ఐటీ సెల్ టీమ్ మానిటరింగ్…