ప్రతిపక్షం అంటే ఖాళీగా కూర్చోవడం కాదని, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి చేశారో మీ విజ్ఞత కే వదిలేస్తామన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కాలు బయట పెట్టగానే ఎందుకు అంత ఉలిక్కిపడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత brs ఉండదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి ముందు చూసుకోండని ఆయన వ్యాఖ్యానించారు. 50 సీట్లు కూడా దాటవని సర్వేలు చెబుతున్నాయని, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ని మూసి వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాకముందు రైతుల పరిస్థితి ఎలా ఉందో… ఇప్పుడు అలాంటి కి వచ్చిందని, రైతుల దగ్గరకు వెళ్లే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు శ్రీనివాస్ గౌడ్. అందుకే ప్రతిపక్షంగా మేమే వెళ్లి రైతులకు ధైర్యం చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు.