నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో హల్వా వేడుక.. కేంద్ర బడ్జెట్ 2025-26 తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకోవడంతో సంప్రదాయబద్దకంగా ఈరోజు (జనవరి 24) ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను ఏర్పాటు చేయబోతుంది. ఈ వేడుకలు పార్లమెంట్లోని నార్త్బ్లాక్లో సాయంత్రం 5 గంటలకు పూర్తికానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగే ఈ వేడుకకు బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగమైన అధికారులు మాత్రమే హాజరవుతారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు.. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు.
విశాఖలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అందుకోసం 3 వింగ్స్ ఏర్పాటు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా బుకీలా వివరాలు కనుకుంటున్నారు పోలీసులు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవనంలో కొంత భాగం కుప్ప కూలింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు కొంత దూరంగా ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాదానికి సంబంధించి ఎలా జరిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు రాష్ట్రానికి రానున్నారు. దావోస్ పర్యటన తర్వాత ఈరోజు అర్ధరాత్రి ఢిల్లీకి వచ్చిన సీఎం చంద్రబాబు.. ఢిల్లీ నుంచి సాయంత్రం 4 గంటలకు అమరావతి చేరుకోనున్నారు. అనంతరం.. సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదని ఆరోపించారు. ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టి వేదిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువయ్యాయి... ఇలాంటి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడుతారని అన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖలో సమగ్ర మార్పుల మీద దృష్టి సారించారు. రాష్ట్ర అటవీశాఖకు ఎదురవుతున్న సవాళ్లను, శాఖాపరంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రాధాన్య క్రమంలో మార్పులు తీసుకురానున్నారు. దశాబ్దాలుగా అటవీ శాఖలో ఉన్న సమస్యలు, పరిష్కారం మార్గాలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని శాఖ పి.సి.సి.ఎఫ్, హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.ను ఆదేశించారు.
సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటనతో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా..? అని ప్రశ్నించారు.
కేజ్రీవాల్, ఆప్ మంత్రులు యమునాలో స్నానం చేయగలరా? యూపీ సీఎం సవాల్ వింటర్ సీజన్లో దేశ రాజధాని ఢిల్లీలో వాడివేడి విమర్శలతో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధానంగా ఆప్-బీజేపీ నాయకుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కేజ్రీవాల్, ఆప్ మంత్రులకు సవాల్ విసిరారు. తాను, యూపీ కేబినెట్ మంత్రులంతా ప్రయాగ్రాజ్లోని సంగమంలో స్నానం చేశామని.. తమకు లాగా కేజ్రీవాల్,…