వచ్చే ఏడాది ఆర్ధిక బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం కసరత్తు దాదాపు పూర్తయింది. ఆయా శాఖలు ప్రతిపాదనలు ఆర్ధిక శాఖకు అందించే పనిలో ఉన్నాయి. గత బడ్జెట్ల కంటే భిన్నంగా కూటమి సర్కార్ బడ్జెట్ ప్రవేశ పెట్టె ఆలోచనలో ఉంది. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వాలని కుటమి సర్కార్ భావిస్తోంది.
కేరింగ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బోరో డ్రోపులిక్తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వడేర్‌లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి జన్యుచికిత్స, అత్యాధునిక ఆరోగ్యసంరక్షణ మౌలిక సదుపాయాల్లో భాగస్వామ్యం వహించాలన్నారు లోకేష్.
Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పునరుద్ధరింపబడిన బస్టాండ్ ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సంవత్సరంలో 4 కోట్ల 500 రూపాయల విలువ గల 134 కోట్ల మంది మహిళలను క్షేమముగా గమ్య స్థానాలకు చేర్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో హుస్నాబాద్ డిపో పరిధిలోని 169 గ్రామాలకు బస్ సౌకర్యం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. హుస్నాబాద్ డిపో లాభాల్లో నడవడం శుభసూచకం,…
గుంటూరు తూర్పు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. భగత్ సింగ్ జయంతి సందర్భంగా 1వ వార్డులో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు స్థానిక టీడీపీ మహిళా నేతలు.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు. అయితే.. వార్డులో కార్యక్రమాలు నిర్వహించే సమయంలో స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌ను అడ్డుకున్నారు టీడీపీ డివిజన్ స్థాయి నాయకులు.
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్లో ఇప్పటి వరకు 600 మందిని తొలగించాం.. త్వరలోనే సంస్థ విస్తరణ చేయనున్నామని తెలిపారు. సంస్థలో తొలగించిన వారి స్థానంలో మళ్ళీ ఉద్యోగాలు ఇస్తామని అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం.. లబ్దిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామ సభల్లో లీడర్ల చెంపలు పగులుతున్నాయి. గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక సందర్బంగా నాయకుల మధ్య విద్వేశాలు రగులుతున్నాయి. అయితే, తాజా ఘర్షణలకు ఎక్కువ భాగం నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి మధ్యనే వివాదాలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఈ సభల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పట్టణాల్లో సాఫీగా జరుగుతున్నప్పటికీ గ్రామాల్లోమాత్రం నేతల మధ్య వాగ్వావాదాలు,…
విశాఖలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వుడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో భారీగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు చేశారు.
ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. వచ్చే నెల (ఫిబ్రవరి 6) న ఈ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో వచ్చే బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. త్వరలో ప్రారంభించే సంక్షేమ పథకాలపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది.
అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్ వార్తపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం చేసింది. బాధ్యులైన వైద్యులపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. అక్రమ కిడ్నీ రాకెట్ మార్పిడిపై తెలంగాణ వైద్య మండలి స్పందించి సుమోటోగా స్వీకరించి విచారణ చేయనున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) ప్రకటించింది.
ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోలు ప్రైవేట్ సంస్థల పరిధిలోకి వెళ్లిపోతున్నాయనే దుష్ప్రచారం పూర్తి అవాస్తవమని పేర్కొంది.