వారికి శుభాకాంక్షలు తెలిపిన జగన్..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం శనివారం ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డును మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అలాగే పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మశ్రీకి 30 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలుగు వారు ఉన్నారు. ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్ రావడంపై హర్షం వ్యక్తం చేసిన మాజీ సీఎం.. ఎక్స్‌లో పోస్టు చేశారు.
రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే
చంద్రవంచ గ్రామ ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ గ్రామం నుంచి ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కొడంగల్ నియోజక వర్గానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంటుందని, రైతుకు కాంగ్రెస్‌కు చాలా అనుబంధం ఉంది.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది.. ఆనాడు 78 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు చేసిన మంచి పనులను వారసత్వంగా తీసుకుని ఈ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోందని, రైతులకు మొదట విడతలో 7 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దే అని, దేశంలో ఎక్కడ కుడా రుణమాఫీ చేయాని విధంగా తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తెచ్చామని, ఉచిత బస్సు స్కీమ్ ద్వారా 4 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్ కు చెల్లించామని ఆయన పేర్కొన్నారు.
త్రివిధ దళాల కుటుంబాల కోసం ముందడుగు వేసిన విష్ణు మంచు
మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ శ్రీ విష్ణు మంచు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ప్రకటించారు. త్రివిధ దళాలలో పని చేస్తున్న తెలుగు వారిని గౌరవించుకునేందుకు, వారి పిల్లలకు 50శాతం స్కాలర్‌షిప్‌ను అందించబోతున్నట్టుగా విష్ణు మంచు ప్రకటించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలోని అన్ని తెలుగు కుటుంబాలకు వర్తించనుంది. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో అందించే అన్ని కోర్సులకు ఈ స్కాలర్‌షిప్‌లను అందించనున్నారు.
గాజా ప్రజల్ని జోర్డాన్, ఈజిప్ట్ తీసుకోవాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
హమాస్-ఇజ్రాయిల్ మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాదాపుగా ఏడాదిన్నర పాటు సాగిన గాజా యుద్ధానికి తాత్కాలిక విరామం లభించినట్లైంది. సంధిలో భాగంగా హమాస్ చెరలో ఉన్న 90 మంది ఇజ్రాయిలీ బందీలను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను విడుదల చేస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా పదవీ బాధ్యతలు చేపట్టిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గాజా ప్రజలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనియన్లను ఈజిప్టు, జోర్డా్న్ తీసుకోవాలనే ఆలోచనను శనివారం ముందుకు తెచ్చారు. అయితే, ఈ ప్రతిపాదనను ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి జెజలెన్ స్మోట్రిక్ స్వాగతించారు. మరోవైపు హమాస్, ఇస్లామిక్ జిహాద్ సహా పాలస్తీనయన్ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకించాయి.
రాజకీయ పార్టీలు ఉనికి కాపాడుకునేందుకు విమర్శలు చేయడం మామూలే
మారు మూల గ్రామం వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు.. ఇందిరమ్మ ఇచ్చిన ఇంటి జాగా ఉంటుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి. ఇందిరమ్మ ప్రధానిగా ఉన్నప్పుడు మనం చిన్న పిల్లలమని, ఇందిరా గాంధీ.. నిజాం కాలేజీకి వస్తుంది అంటే.. మూడు రోజుల ముందు వచ్చి జనం ఎదురు చూసే వారన్నారు. తెలంగాణలో ఎంపీ సీట్లు మిస్టేక్‌లో వచ్చాయని, మళ్ళీ పెరుగుతాయి అనుకుంటున్నారు కానీ పెరగవన్నారు. ఇందిరమ్మ గురించి ఏం తెలుసు నీకు.. మనం పుట్టక ముందే… ఇందిరమ్మ ఇళ్లు..జాగా ఇచ్చిందన్నారు. బండి సంజయ్ కి ఇందిరమ్మ చరిత్ర ఏం తెలుసు..? అని ఆయన ప్రశ్నించారు. నీ పార్లమెంట్ లో..నీ ఊరికే పోదామని, నీ సొంత ఊరుకు పోదామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయో లేదో తెలుసుకుందామని, 80 యేండ్ల అవ్వను అడిగితే చెప్తుంది ఇందిరాగాంధీ చరిత్ర ఏంటో..? అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం చిన్నగోపతిలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశమన్నారు. భారతదేశానికి నేడు అత్యంత పవిత్రమైన రోజు ఈ దేశ రాజ్యాంగాన్ని ఆమోదింపజేసుకున్న రోజు అని, గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందన్నారు భట్టి విక్రమార్క. ప్రభుత్వం అమలు జరుపుతున్న ఈ నాలుగు పధకాలకు 45 వేల కోట్ల ఖర్చు అవుతోందన్నారు. కెసిఆర్ పది సంవత్సరాల రాష్ట్రంలోని నిరుపేదలను పట్టించుకోలేదని, కనీసం పదేళ్ల లో రేషన్ కార్డ్ కూడా ఇవ్వలేదన్నారు భట్టి విక్రమార్క. ఎక్స్ పోస్ట్ లు పెడుతున్న నాయకుడికి స్పష్టంగా చెబుతున్నానని, మీరు పదేళ్ల లో ప్రజలకు రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే నేడు మేము రేషన్ కార్డులు ఇచ్చే అవసరమే లేదన్నారు. పదేళ్ల మీ పాలనలో గడీలలో కూర్చుని లెక్కలు రాసి దోపిడీ చేశారని, మేము గ్రామ గ్రామాన సభలు నిర్వహించి ప్రజల మధ్యలో ప్రజల ఆమోదం తో పధకాలు కేటాయిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క.
భారత్‌కి పుతిన్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు..
భారతదేశం ఈ రోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. రాష్టపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విదేశాలు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా భారత్‌కి శుభాంక్షలు చెబుతున్నాయి. భారత మిత్ర దేశం రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ తన సందేశాన్ని పంపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హృదయపూర్వక అభినందనలు చెప్పారు. ‘‘75 సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చిన రాజ్యాంగం భారతదేశం యొక్క ప్రభావవంతమైన రాష్ట్ర సంస్థలను నిర్మించడానికి మరియు స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య అభివృద్ధికి పునాది వేసింది. అప్పటి నుండి, మీ దేశం సామాజిక ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక మరియు ఇతర రంగాలలో విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన విజయాలను సాధించింది. అంతర్జాతీయ రంగంలో తగిన అధికారాన్ని పొందింది’’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అభినందనలు తెలిపింది.
హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం.. మంత్రి హెచ్చరిక
సత్యసాయి జిల్లా సీకే పల్లి బీసీ హాస్టల్ లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందని ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి ఆదేశాలతో బీసీ సంక్షేమశాఖాధికారులు భోజనం సదుపాయం కల్పించారు. హెచ్ డబ్ల్యూవోపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం మంత్రి సవిత కలెక్టర్, బీసీ సంక్షేమ శాఖాధికారులతో ఫోన్లో మాట్లాడారు. సీకే పల్లి బాలుర హాస్టల్ లో మధ్యాహ్న భోజనం ఎందుకు సమకూర్చలేదని మంత్రి ఆరా తీశారు. హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణి సరికాదని మండిపడ్డారు. తక్షణమే విద్యార్థులకు భోజనం సదుపాయం కల్పించాలని, రాత్రికి కూడా ఎటువంటి లోటూ రానివ్వొద్దని స్పష్టంచేశారు.
తెలంగాణలో రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కుతున్నారు
భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయము అని అన్నారు.. ఇది రాష్ట్రాల హక్కులను హరించడం కాదా అని ఆమె అన్నారు. ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని… కింద స్థాయిలో పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు కాదా అని ఆమె ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అనే మాట మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లు అని, బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు.
4ఏళ్ల తర్వాత జానీ మాస్టర్‌పై కేసు పెట్టడానికి కారణం ఇదే.. స్పందించిన బాధితురాలు..
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై గతేడాది అత్యాచారం కేసు నమోదయింది. మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు అందడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అత్యాచార ఆరోపణల కేసులో జానీ మాస్టర్ 36 రోజులుగా జైల్లో ఉన్నారు. గతేడాది అక్టోబర్ 27న విడుదలయ్యారు.