ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్లి రాష్ట్రానికి లక్ష 78 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తే.. సంతోషించవలసిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఫెడరల్ సెటప్.. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ.. సంగారెడ్డిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 2007లో గెలుపొందారు.
హైదరాబాద్లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, రామ చందర్ రావు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాజధాని ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారందరికీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయా రంగాల్లో వారు చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని ఆయన అన్నారు.
నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ వరించిన సంగతి తెలిసిందే.. నటుడిగా, నిర్మాతగా, సమాజ సేవలో చేసిన అద్భుత కృషికి ఈ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి విశేష కృషి చేసిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రదానం చేయడంపై సినీ ప్రముఖులతో పాటు.. రాజకీయ ప్రముఖులు కూడా అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం.. కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం క్షమశిక్షణ లేని ఆర్ధిక ప్రణాళికల వల్ల హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడిందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన రూ.4500 కోట్లను గత ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 114,000 ఇళ్ళు పూర్తి చేసిందని.. ఫిబ్రవరి 1న తణుకు నియోజకవర్గం తేతలి గ్రామం నుంచి సీఎం చంద్రబాబు…