ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) శనివారం 2024 పురుషుల టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌ని ప్రకటించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. రోహిత్ సారథ్యంలో భారత్ గతేడాది టీ20 ప్రపంచకప్ 2024 గెలుచుకుంది. 2024 సంవత్సరంలో అత్యుత్తమ టీ20 జట్టుగా భారత్ ఆధిపత్యం చెలాయించింది. ఈ జట్టులో నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.
విజయసాయిరెడ్డి రాజీనామాపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. విజయసాయి రెడ్డికి కలలోకి గొడ్డలి వచ్చిందేమో, అందుకే భయపడి రాజీనామా చేసి ఉండొచ్చని హోంమంత్రి సెటైర్లు వేశారు.
ఇండియా 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోనుంది. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సంబరాలు ఘనంగా జరగనున్నాయి. మరోవైపు.. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది.
విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని ఎక్స్ లో పేర్కొన్నారు.
డబ్బుతో ఓట్లు కొనేవారికి బుద్ధి చెప్పండి.. ప్రజలకు కేజ్రీవాల్ పిలుపు దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలను ఉద్దేశించి ఆప్ అధినేత కేజ్రీవాల్ వీడియో సందేశం విడుదల చేశారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు. గురువారం వీడియోలో ఐదేళ్లలో నిరుద్యోగం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొచ్చారు. తాజాగా శుక్రవారం విడుదల చేసిన వీడియోలో…
జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజులపాటు ప్లీనరీ జరపాలని నిర్ణయించారు.
విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఈవెంట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరిశీలించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్న ఈవెంట్ కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. ఫిబ్రవరి 15న నిర్వహించే కార్యక్రమం కోసం ఏర్పాట్లపై భువనేశ్వరి పోలీసులతో చర్చించారు.