Kishan Reddy: రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. గెలిచి తీరాలి
- కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
- రాష్ట్రంలో 70 శాతం మండలాల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు- కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. సద్వినియోగం చేసుకోవాలి
- మూడు స్థానాలు గెలిచి తీరాలి- కిషన్ రెడ్డి
- ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుందాం- కిషన్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, కర్నాటక బీజేపీ సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 శాతం మండలాల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మూడు సీట్లు గెలిచిన సానుకూల పరిస్థితులు బీజేపీకి ఉన్నాయన్నారు. మూడు స్థానాలు గెలిచి తీరాలని కిషన్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుందాం.. బూత్, అసెంబ్లీ, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొందామన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని తెలిపారు. మండలి ఎన్నికల ద్వారా దాన్ని మనం రుజువు చేయాలి.. ఓటర్‌ను నేరుగా కలిసేలా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో పని విభజన చేసుకోవాలి.. త్వరలో జిల్లా లేదా అసెంబ్లీ వారీగా వర్క్ షాప్ నిర్వహించుకుందామని కిషన్ రెడ్డి తెలిపారు.
Read Also: Allu Arjun: త్రివిక్రమ్ బన్నీ స్టోరీలైన్ లీక్.. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తమిళనాడు, కర్నాటక బీజేపీ సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. అంబేద్కర్, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమాన పరిచింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన చరిత్రను మరిచి వ్యవహరిస్తుంది.. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడం ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా ఉందని అన్నారు. బేషరుతుగా కేంద్ర ఇచ్చే సంక్షేమ పథకాల మీద ప్రధాని బొమ్మ పెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కక్ష్య పూరితంగా వ్యవహరించకుండా పెద్ద ఎత్తున, నిధులు కేటాయిస్తుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు రావడం లేదని కక్ష్య పూరితంగా విష ప్రచారం చేస్తున్నారు.. ఇచ్చిన వాగ్దానాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వం హైడ్రా, మూసీ అంటూ హడావుడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. పద్మ అవార్డుల మీద తప్పుడు రాజకీయాలు చేయడం సరైంది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రకరకాల వాగ్దానాలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని సుధాకర్ రెడ్డి తెలిపారు.
Read Also: CM Revanth Reddy: రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అందరం కలిసికట్టుగా పోరాడాలి..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!