ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముందు ఉంచింది. కాగా.. ఆరంభంలోనే ట్రెంట్ బౌల్ట్ 3 కీలక వికెట్ల తీసి శుభారంభాన్ని అందించాడు.
దేవుడిమాన్యాలు కుడా ఖబ్జాకు పెట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోరిన కొరికలు తీర్చే దేవుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి అని, గత ప్రభుత్వం హయంలో దేవాదాయ శాఖలో మితిమీరిమ అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. దేవుడిమాన్యాలు కుడా ఖబ్జాకు పెట్టారని, దేవాలయాలలో దేవుడి మాన్యం భూములు ఎన్ని ఉన్నాయో ఎంక్వైరీ చేస్తున్నామన్నారు…
సండే వచ్చిందంటే చాలు ముక్కలేనిది ముద్ద దిగదు. అయితే గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు చికెన్ తినాలన్న ఆశ తీరకుండానే ఉండిపోతుంది. మరోవైపు.. పెరిగిన ధరలు చూసి నాన్ వెజ్ ప్రియులు షాక్ అవుతున్నాయి.
ఇంగ్లండ్ వైట్ బాల్, ప్రస్తుత ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ తన పేరును మార్చుకున్నాడు. 'వాస్తవంగా నా పేరు జోస్ (JOS) బట్లర్. అయితే అందరూ జోష్ (JOSH) బట్లర్ అనే పిలుస్తున్నారు. ఆఖరికి మా అమ్మ కూడా ఇలానే పిలుస్తుంది. దీంతో.. 13 ఏళ్ల కెరీర్, 2 వరల్డ్ కప్ విజయాల తర్వాత ఇప్పుడు అధికారికంగా నా పేరును జోష్ బట్లర్ గా మార్చుకుంటున్నా' అని పేర్కొన్నారు. అందుకు సంబంధించి వీడియోను ఇంగ్లండ్…
ప్రస్తుత ఏప్రిల్, మే మాసాల్లో అధిక ఉష్ణోగ్రతతో కూడిన ఎండలు ఉన్నందున వడదెబ్బ, డీ-హైడ్రేషన్ తదితర వ్యాధులకు గురికాకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో త్రాగు నీటి సరఫరా, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ధాన్యం కొనుగోలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ,…
శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగుతోంది. అందులో భాగంగా.. బంగ్లాదేశ్ జట్టు కొంత విచిత్రంగా ప్రవరిస్తోంది. బౌండరీకి వెళ్తున్న బంతి వెనకాల ఐదుగురు ఫీల్డర్లు పరిగెత్తి ఆశ్చర్యానికి గురి చేశారు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బంగ్లా ప్లేయర్లకు పిచ్చి ముదిరందా అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.
కేసీఆర్ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే రైతుల దగ్గరకు వచ్చాడని విమర్శించారు మంత్రి కొండా సురేఖ. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారం లో ఉన్నప్పుడు రైతులను ఎప్పుడు అదుకోలేదన్నారు. ఉచిత విద్యుత్ పేరుతో అధిక ధరలకు కరెంట్ కొని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని, వై ఎస్ పాలన లో రైతులకు ఎన్నో సబ్సిడీలు ఉండేవి పట్నన్నిటిని తొలగించి కేవలం రైతుబంధును పెట్టి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. రైతుల…
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ముంబై వాంఖడే వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే హోంగ్రౌండ్ లో జరిగే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో ముంబై ఉంది. మరోవైపు.. వరుస విజయాలతో దూకుడుగా ఉన్న…
టీడీపీ అధినేత చంద్రబాబు మాట మార్చి మాట్లాడే నేర్పరి అని, దిగజారి మాట్లాడతారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. జగన్ తన రాజకీయ స్వార్థం కోసం పెన్షర్ల పొట్ట కొట్టారని చంద్రబాబు సిగ్గులేకుండా అంటున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. వాలంటరీలు వద్దు అని ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు.