CM Revanth Reddy : ఆత్మ గౌరవ పతాకను ఎగురవేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన యోధుడు దొడ్డి కొమురయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు, ఆత్మ గౌరవ పతాకను ఎగురవేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన యోధుడు దొడ్డి కొమురయ్య అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకొని ఆయన త్యాగాన్ని, ఆయన ఉద్యమ స్ఫూర్తిని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన నుంచి విముక్తి పొంది ప్రజా పాలన ఏర్పడేందుకు దొడ్డి కొమురయ్య ఉద్యమ స్పూర్తిని అందిపుచ్చుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ సాయుధ పోరులో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య త్యాగం చిర స్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని, ఈ క్రమంలోనే పేద కుటుంబాలకు రెండొందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సంక్షేమ పథకాలు, రాయితీలు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నియంతృత్వ పాలన నుంచి విముక్తికి సాగిన సాయుధ పోరాటం, సాయుధ పోరాట యోధుల నుంచి స్ఫూర్తిని పొంది వారి ఆశయమైన ప్రజా పాలన సాగిస్తున్నామని, ప్రతి ఒక్కరి అభిప్రాయాలకు విలువనిస్తూ, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం కల్పించామని, మంత్రివర్గం మొదలు అన్ని నియామకాల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!