వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యను మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. కడియం కావ్య పేరును కొద్దిసేపట్లో కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తుందని ఆమె వెల్లడించారు. ఇవాళ మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. పొలం భాట కార్యక్రమం పేరుతో కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని ఆమె ధ్వజమెత్తారు. మాయమాటలు…
సోమవారం ఎన్నికల సంఘాన్ని పశ్చిమ బెంగాలు బీజేపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా.. టీఎంసీ నేత పీయూష్ పాండాపై ఫిర్యాదు చేశారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రచారం చేయకుండా నిషేధించాలని ఎన్నికల కమిషన్ను బీజేపీ కోరింది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోడీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన సమయంలో తన కులాన్ని ఉద్దేశించి పాండా వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో.. రోజు ఢిల్లీలో ఈసీని కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.…
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సోమవారం బిగ్ రిలీఫ్ లభించింది. ప్రభుత్వ ఖజానా (తోషాఖానా) అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ఇద్దరికీ 14 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే..
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బ్యాటింగ్ విభాగంతో పాటు బౌలింగ్ విభాగం కూడా చాలా బలంగా ఉంది. అందుకు నిదర్శనం.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో చెన్నై ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరణ తీసిన వికెట్లే. ఆ మ్యాచ్లో పతిరణ యార్కర్లతో విరుచుకుపడ్డాడు. గంటకు 150 కి.మీ వేగంతో యార్కర్ బౌలింగ్ వేసి ఒకే ఓవర్ లో రెండు కీలక వికెట్లు తీశాడు. కళ్లు మూసి తెరిచేలోపు బంతి జట్ స్పీడ్ తో దూసుకుపోయింది. 15 ఓవర్లో పతిరణ…
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోరిన కొరికలు తీర్చే దేవుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి అని, గత ప్రభుత్వం హయంలో దేవాదాయ శాఖలో మితిమీరిమ అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. దేవుడిమాన్యాలు కుడా ఖబ్జాకు పెట్టారని, దేవాలయాలలో దేవుడి మాన్యం భూములు ఎన్ని ఉన్నాయో ఎంక్వైరీ చేస్తున్నామన్నారు కొండా సురేఖ. సర్వే చేసి…
కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తాం..! కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తామని ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్ళే ఈ కుట్ర ఇవ్వాల్టిది కాదని, అసెంబ్లీ సమావేశంలోనే ఈ కుట్రకు బీజం పడిందన్నారు. మూడు నెలల క్రితమే ఈ కుట్రకు తెర లేసిందన్నారు. రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి భుజం పైనా…
దేశంలో మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను(GST) రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. వ్యాట్ స్థానంలో తీసుకురాబడిన జీఎస్టీ ఊహించిన దానికంటే మెరుగైన పనితీరును కనబరుస్తోంది. మార్చిలో రూ. 1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11.5 శాతం ఎక్కువ. ఇది ఇప్పటి వరకు రెండవ అత్యధిక వసూళ్లు కావటం గమనార్హం.
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ కు నిన్నటి ఆదరణ చూస్తుంటే నిజంగానే నల్లగొండ జిల్లాలో ఓడిపోయామా అనిపించిందన్నారు. చేసింది చెప్పుకొకపోవడం, ప్రచారం చేసుకోకపోవడం వల్లే ఓడిపోయామని, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు పార్లమెంట్ ఎన్నికలో జరగొద్దన్నారు. నోటిఫికేషన్ లు ఇచ్చినా… మనం నిరుద్యోగ యువత మనసు గెలుచుకొలేకపోయమని, అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం ఉద్యోగులు బీఆర్ఎస్ కు వ్యతరేకంగా ఓటు…