Kakarla Suresh: పల్లె పల్లెకు కాకర్ల.. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakarla Suresh: నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన సీతారాంపురం పరిధిలోని చిన్నాగంపల్లి, పబ్బులేటిపల్లి పంచాయతీల్లో ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ముఖ్యంగా మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న ఆయనకు మహిళలు హారతి ఇచ్చి సాదరంగా ఆహ్వానించా రు. ఉదయగిరి శాసనసభ అభ్యర్థిగా తనను గెలిపించాలని పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కాకర్ల ఈ సందర్భంగా కోరారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ మహిళలు తన వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు అని ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
Read Also: CM Jagan: మళ్లీ ముగ్గురు కూటమిగా వస్తున్నారు.. ఒకసారి ఆలోచించండి!
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
అవ్వా తాతలను, ఆడపడుచులను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటికి కాకర్ల సురేష్ తిరిగారు. ఆడపడుచులు హారతులు, అవ్వ తాతలు ఆప్యాయతలు, అన్నదమ్ముల జేజేల నడుమ, కోలాహలంగా ప్రచారం సాగింది. పల్లె పల్లెలో బ్రహ్మరథం, అడుగడుగునా నీరాజనాలు, పూల వర్షంతో పల్లె ప్రజలు ఘన స్వాగతం పలికారు. పల్లె ప్రాంతాల కష్టాలు చూసి చలించి పోయిన కాకర్ల సురేష్.. నాలుగు సంవత్సరాలలో రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. వ్యక్తిగత కష్టాలను, గ్రామ సమస్యలను ఉదయగిరి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్‌కు గ్రామ ప్రజలు తెలిపారు. పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కాకర్ల అడుగులో అడుగులు వేస్తూ ప్రచారం చేశారు. భానుడు భగభగలు లెక్కచేయక ఇంటింటికి తిరిగి ఆదరించాలని కోరుతూ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వారి కష్టాలు తెలుసుకుంటున్నారు. సీతారాంపురం మండలంలో పల్లె ప్రజలు బ్రహ్మరథం పడుతూ కాకర్ల సురేష్‌ను ఆశీర్వదిస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!