లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు హస్తం పార్టీ సమరశంఖం పూరించనుంది. ఈ భారీ బహిరంగసభకు ‘జనజాతర’ అని నామకరణం చేశారు.
ఐపీఎల్ తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గాయాలు వదలడం లేదు. ఇప్పటికే జట్టు వరుస ఓటములతో ఇబ్బంది పడుతుండగా.. జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం అవుతున్నారు. తాజాగా.. మరో స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ దూరం కానున్నారు. గాయం కారణంగా ముంబైతో జరిగే మ్యాచ్‌కు ఆడటం కష్టమేనని టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ తెలిపారు. అంతేకాకుండా.. అతను కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుందో చెప్పలేదు. కాగా.. ఈసీజన్ లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన మార్ష్.. 71…
షెడ్యూలు కులాల వర్గీకరణ కోసం సుధీర్ఘ పోరాటం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. రాబోయే రోజులలో ఎస్సీ వర్గకరణపై నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి భరత్ కీలక పాత్ర పోషిస్తాడని అన్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఇంతకుముందు చెప్పు చూపి బెదిరించగా.. ఇప్పుడు నీకు తన్నులు తప్పేలా లేదన్నట్లుగా ఓ మీమ్ షేర్ చేశాడు. మరోసారి "చెత్త షాట్ ఆడి ఔటయ్యావు’’ అంటూ ఓ వ్యక్తి కర్ర చేతిలో పట్టుకుని మరో వ్యక్తిని తరుముతున్నట్లుగా ఉన్న మీమ్ ఒకటి షేర్ చేశాడు. కాగా.. యువరాజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న (శుక్రవారం) ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ బిగ్ ఫైట్ ను చూసేందుకు ఆరెంజ్ ఆర్మీతో పాటు.. సీఎస్కే ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున వచ్చారు. ముఖ్యంగా ధోనీని చూసేందుకు చాలా మంది అభిమానులు.. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. అయితే.. ఈ మ్యాచ్ ను లైవ్ లో చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చిన ధోనీ అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. హ్యాపీగా…
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపంతో ఆలస్యం కావడంతో అధికారుల నిర్లక్ష్యానికి ఆందోళన చేశారు.
కాకుల్‌లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ (ASPT)లో పాకిస్తానీ క్రికెటర్ల ఆర్మీ శిక్షణా కొనసాగుతుంది. శిక్షణా శిబిరంలో వారంతా కొండలపై రాళ్లను మోస్తూ కనిపించారు. మొత్తం 29 మంది ఆటగాళ్లు కఠినమైన ఫిట్నెస్ సాధించేదుకు కసరత్తులు చేస్తున్నారు. కొత్తగా నియమించబడిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జట్టు యొక్క ఫిట్నెస్ స్థాయిలలో గణనీయమైన మెరుగుదల.. స్థిరంగా బౌండరీలు కొట్టే వారి పవర్-హిటింగ్ సామర్థ్యాన్ని చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాష్ట్రంలోని జలాశయాలు ఎండిపోతున్నాయి. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో నది ప్రవాహాలు సన్నని ధారలా కూడా రావడం లేదు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఇప్పటికే నీరు అడుగు పట్టింది. కృష్ణానది పరివాహకంగా ఇప్పటికే పరిస్థితి ఆందోళన కరంగా మారుతోంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టులో గతేడాదితో పోలిస్తే ఇప్పటికే నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి.
ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న (శుక్రవారం)సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి హోంగ్రౌండ్లో గెలిచి సత్తా చాటింది. కాగా.. ఈ మ్యాచ్‌తో చెన్నై వరుసగా రెండు ఓటములను నమోదు చేసుకుంది. మ్యాచ్ జరిగింది హైదరాబాద్‌లో అయినప్పటికీ.. అభిమానులు అందరూ చెన్నైకి సపోర్ట్ చేశారు. అయినా చెన్నై విజయం సాధించలేకపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
వ్యవసాయం సంక్షోభంలో ఉందని, మన ప్రభుత్వం పోయి నాలుగు నెలల్లో ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనుకోలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం తెలంగాణ భవన్లో రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు.