మార్చి 16 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.09 కోట్లని, జనవరి 22న నమోదైన 4.07 కోట్లతో పోలిస్తే ఇది పెరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా శనివారం తెలిపారు. మొత్తం ఓటర్లలో రెండు కోట్ల మంది పురుషులు, 2.08 కోట్ల మంది మహిళలు, 3,346 మంది థర్డ్ జెండర్ ఉన్నారని ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలను ప్రకటించిన రోజున ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. మే 13న…
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభ సందర్భంగా ఆ రహదారిలో వాహనాల దారి మళ్లింపు చేశారు పోలీసులు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. మార్కాపురం నుంచి ఒంగోలు వైపు వెళ్లే వాహనాలు నాగిరెడ్డిపల్లి దగ్గర నుంచి వెలిగొండ స్వామి గుడి మీదుగా చినమనగుండం వద్ద నంద్యాల నుంచి ఒంగోలు వెళ్లే రహదారిలో వెళ్లాలి. ఒంగోలు నుంచి మార్కాపురం వైపు వెళ్లే వాహనాలు పొదిలి, చిన్నారికట్ల జంక్షన్ దాటిన తర్వాత పాతపాడు మీదుగా కాట్రగుంట, చౌటపాలెం…
నేడు అనకాపల్లిలో జనసేన చీఫ్ రోడ్ షో.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా నేడు (ఆదివారం) అనకాపల్లికి రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3. 30 గంటలకు హెలికాప్టర్లో అనకాపల్లి డైట్ కాలేజ్ సమీపంలో గల ఒక ప్రైవేటు లేఅవుట్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి రింగ్ రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల బజారు, చిన్న నాలుగు రోడ్ల కూడలి, కన్యకా పరమేశ్వరి జంక్షన్, వేల్పుల…
నేడు పదోరోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర కొనసాగనుంది. ప్రకాశం జిల్లాలో జగన్ బస్సుయాత్ర కొనసాగుతుంది. పెద్దఅలవలపాడు, కనిగిరి మీదుగా పెద్ద అరికట్లకు జగన్. సాయంత్రం కొనకనమెట్ల క్రాస్ దగ్గర బహిరంగ సభకు చేరుకుంటారు. అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల, పొదిలి, రాజంపల్లి దర్శి మీదుగా వెంకటాచలంపల్లికి జగన్. వెంకటాచలంపల్లిలో రాత్రి బస చేయనున్నారు సీఎం జగన్. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం తొమ్మిది గంటలకు జువ్విగుంట క్రాస్‌లో రాత్రి బస చేసిన ప్రాంతం…
నేడు కృష్ణాజిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రలో పాల్గొనున్నారు. అంతేకాకుండా.. ఆయన బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. నేడు కృష్ణా జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు రాష్ట్రమంతటా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మలి విడత యాత్రలో భాగంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు నిన్న పల్నాడు జిల్లాలో పర్యటించారు. పామర్రు, ఉయ్యూరులో… ఈరోజు చంద్రబాబు కృష్ణా జిల్లాలో…
జమ్మూకశ్మీర్‌లో భూకంపం గత కొద్దిరోజులుగా భూకంపం వస్తూనే ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో జోరందుకుంటుంది. ఈ క్రమంలో.. టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. విజయవాడ రూరల్ గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో ఇండిపెండెంట్ సర్పంచ్ కొడాలి సుకన్య, ఆమె మద్దతుదారులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఆర్సీబీ-రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 184 పరుగుల టార్గెట్‌ను 19.1 ఓవర్లలో ఛేదించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. ఆర్సీబీ బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయగా.. అతని సెంచరీ వృధా అయింది. రాజస్థాన్ బ్యాటింగ్‌లో బట్లర్ సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 సిక్స్ లు, 9 ఫోర్లు…
రష్యాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మాత్తుగా ఉరల్ నది వరదలు సమీప గ్రామాలలోకి నీరు ప్రవేశించింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లలోనే చిక్కుకుపోయారు. కజకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఓరెన్‌బర్గ్ ప్రాంతంలో ఆనకట్ట తెగిపోవడంతో భారీగా వరదలు వచ్చాయి. వరదల భారీ నుంచి సుమారు 4,000 మందికి పైగా మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. దీనిపై.. ఓరెన్‌బర్గ్ గవర్నర్ కార్యాలయం శనివారం ఓ ప్రకటన చేసింది. '1,019 మంది పిల్లలతో సహా 4,208 మందిని రక్షించాం.…
చేతకాక కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్షించారు. తన పార్టీ ప్రభుత్వం ఏమీ చేసిందో తెలియని పరిస్థితిలో రాహుల్ గాంధీ ఉన్నారన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయకుండా అబద్ధాలు చెబుతున్నారని.. దమ్ము, ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ గ్యారెంటీల అమలుపై చర్చకు సిద్దమా అంటూ బహిరంగంగా సవాల్ చేశారు.