మిర్యాలగూడలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. లోక్ సభలో పోటీకి టికెట్ కేటాయింపులలో మాదిగలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రువుగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ భావిస్తుందని తెలిపారు. బీసీలు సైతం కాంగ్రెస్ పార్టీని ప్రథమ శత్రువుగా భావించాలని పిలుపునిస్తోందని అన్నారు. తెలంగాణలో అసలు మాదిగలు లేనట్లుగా భావించి.. పూర్తిగా మాదిగలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Vijay Devarakonda: ఎందుకురా మా దేవరకొండ వెంట ఇలా పడ్డారు.. ఇంత ఓర్వలేని తనమా..!
ఈ సందర్భంగా.. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెల్లోకి వస్తే మాదిగలు అడ్డుకోవాలని తెలిపారు. తన రాజకీయ ఎదుగుదలకు మాదిగలే కారణమన్న సీఎం రేవంత్ రెడ్డికి… మాదిగలపై కృతజ్ఞత లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ద్వితీయ శత్రువుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ నరేంద్ర మోడీతోనే సాధ్యం అని మందకృష్ణ మాదిగ తెలిపారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని చూడాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.. తెలంగాణలో బీజేపీ పార్టీ ఇప్పటికే రెండు స్థానాలలో మాదిగలకు కేటాయించిందని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
Read Also: Elections 2024: మోడీ గెలవాలంటూ చూపుడు వేలు కోసుకున్న వ్యక్తి..!