Matchbox: అగ్గిపెట్టె కోసం గొడవ.. యువకుడి దారుణహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matchbox: ఢిల్లీలో దారుణం జరిగింది. అగ్గిపెట్టె ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరు టీనేజర్లు, ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన దేశ రాజధానిలోని తిమార్‌పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అగ్గిపెట్టె ఇచ్చేందుకు నిరాకరించడంతోనే హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని వినియోగించారు.
సిగరేట్ కాల్చేందుకు అగ్గిపెట్టే ఇవ్వడానికి నిరాకరించడం హత్యకు దారి తీసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. చనిపోయిన వ్యక్తిని 21 ఏళ్ల అన్షుల్ భాటీగా గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులిద్దర్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తిమార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్లకు సంబంధించిన పీసీఆర్ కాల్ వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోరిక్షా లోపల, దాని చుట్టూ రక్తపు మడుగు ఉన్నట్లు గుర్తించినట్లు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్(నార్త్) ఎంకే మీనా తెలిపారు. గాయపడిన వ్యక్తిని హిందూరావు ఆస్పత్రికి తరలించారు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
Read Also: Benjamin Netanyahu: విజయానికి అడుగు దూరం, అప్పటి వరకు కాల్పుల విరమణ లేదు: ఇజ్రాయిల్..
ఆస్పత్రికి చేరుకునే లోపే బాధిత యువకుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సంఘటన స్థలంలో సాక్షి వాంగ్మూలాన్న పోలీసులు నమోదు చేశారు. క్రైమ్ స్పాట్‌లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి పోలీసులు ఇద్దరు నిందితులను ఆదివారం పట్టుకున్నారు. నేరం చేయడానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ప్రశ్నించగా.. సిగరేట్ కాల్చడానికి అగ్గిపెట్టె ఇవ్వాలని కోరగా.. బాధితుడు అందుకు నిరాకరించాడని, ఇది వాగ్వాదానికి దారి తీసిందని వెల్లడించారు. కోపంతో ఒక వ్యక్తి బాధితుడిపై కత్తితో దాడి చేశారని, ఘటన తర్వాత ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిని బాల నేరస్తుల్లో ఒకరికి గతంలో దారుణమైన నేరానికి పాల్పడిన చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!