ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ స్టేడియంలో తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ సీజన్లో రాజస్థాన్‌కి ఇది నాలుగో మ్యాచ్ కాగా.. బెంగళూరుకు ఐదో మ్యాచ్. కాగా.. ఈ సీజన్లో మూడింటిలో మూడు గెలిచి రాజస్థాన్ మంచి ఫామ్‌లో ఉంది. రాజస్థాన్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఇక.. బెంగళూరు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3…
మిషన్ భగీరథ నిర్వహణ సంస్థలతో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్తితుల కారణంగా వేసవిలో నీటి సరఫరా చాలా కీలకమని, అన్ని గ్రామీణ ఆవాసాలలోని ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయడం ఈ శాఖ బాధ్యత అని ప్రిన్సిపల్ సెక్రటరీ గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఆ పార్టీది ‘ఆపన్న హస్తం కాదని, భస్మాసుర హస్తమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ‘పాంచ్ న్యాయ్’ పేరుతో మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు. తెలంగాణను 10 ఏళ్లపాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణమన్నారు.
Hit and Run: కొందరు యువత సెల్ఫీల కోసం ప్రమాదకర పనులు చేస్తుంటారు. కొంత మంది లైక్స్ రావడానికి.. ఫేమస్ కావడానికి రీళ్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా మోజులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు.
చంద్రబాబు తీరు పరకాష్ఠకు చేరిందన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో బాబు కలల కన్న కూటమి వికటించిందన్నారు. చంద్రబాబు ఎవరు అనుకుంటే కూటమి పార్టీ అభ్యర్థులు డిసైడ్ అవుతారన్నారు. పవన్ కళ్యాణ్ కు ఉనికి లేకుండా పోయిందన్నారు. బీజేపీలో కూడా బాబు అనుకున్నట్టే సీట్లు ఖరారు అయ్యాయన్నారు. 2019 ఎన్నికల కంటే ఘోరంగా టీడీపీ ఓటమి చూడబోతుందన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో కూడా చంద్ర బాబుకు పునకాలే అని, సైకిల్ రావాలి… సైకో పోవాలి…
ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారో అని పేద వాడు ఆలోచించడు అని, అక్కడ పేద వాడికి కనిపించేది జగన్ మాత్రమే అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచి చేసిన జగన్ కు మాత్రమే ఓటు వెయ్యాలని పేద వాడు అనుకుంటాడన్నారు. సీఎం రమేష్ ఎక్కడి నుంచి అనకాపల్లికి వచ్చాడని, సీఎం రమేష్ ఆధార్ కార్డు అడ్రెస్ చూడండి.. హైదరాబాద్ అడ్రెస్ ఉంటుందన్నారు మంత్రి అమర్నాథ్. సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు లోకల్..…
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ మరోసారి ఇంగ్లండ్ క్రికెట్ ప్లేయర్లతో మమేకమయ్యారు. ఆట పట్ల మరోసారి తన అభిరుచిని అతడు చాటుకున్నారు. దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో తన బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు.
మరో కొత్త తరహా ప్రయోగానికి ఇస్రో సిద్ధం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కొత్త తరహా ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ఈ రోజు ఉదయం 6 గంటలకు తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ ద్వారా ప్రైవేట్ రాకెట్ ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలోనే కౌంట్ డౌన్ కొనసాగుతోంది. చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన అగ్ని బాన్ రాకెట్ ప్రయోగించనున్నారు. ప్రయోగంలో సెమీ క్రయోజెనిక్ ఆధారిత ఇంజిన్…
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగి నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుల్ సింగ్, మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో బీజేపీ జెండా ఆవిష్కరణతో పాటు, బీజేపీ శ్రేణుల బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కార్యకర్తల ఉన్న పార్టీ…