ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు 184 పరుగుల ఫైటింగ్ స్కోరును ఉంచింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఈ సీజన్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 72 బంతుల్లో 113 పరుగులు చేసి నాటౌట్ గా…
జాతీయ మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద విడుదల చేయడం సంతోషమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడ జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీఆర్ఎస్ను ఓడించిన ఉత్సాహంతోనే బీజేపీని ఓడించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని రేవంత్ తెలిపారు.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆరు గ్యారంటీలకు అప్లయ్ చేసిన ప్రతి అర్హుడికి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు.
Man Kills Daughter: కూతురిపై ఓ తండ్రి దారుణంగా ప్రవర్తించాడు. చివరకు ఆమె ప్రాణాలను తీశారు. చదువు కోవడం లేదని ఆమెను కొట్టి చంపాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లాలో చోటు చేసుకుంది. 17 ఏళ్ల కుమార్తె సరిగా పరీక్షలకు సిద్ధం కావడం లేదని కోపంతో ఆమెను కొట్టి చంపినట్లు శనివారం పోలీసులు తెలిపారు.
ఒకటి, రెండు రోజుల వయస్సులోపు శిశువుల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా సీబీఐ బట్టబయలు చేసింది. ఢిల్లీ, హర్యానాలో జరిపిన దాడుల్లో 1.5 రోజులు, 15 రోజులు, ఒక నెల వయసున్న ముగ్గురు శిశువులను సీబీఐ ముఠా బారి నుంచి రక్షించింది. వీరిలో ఇద్దరు మగ శిశువులు, ఒక నెల వయసున్న ఆడ శిశువు ఉన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. జైపూర్‌లోని సవాయ్ మన్ సింగ్ స్టేడియంలో.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో.. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
తొమ్మిదేండ్ల అహంకార పాలనకు చరమ గీతం పాడింది కాంగ్రెస్ కార్యకర్తలేనని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. తుక్కుగూడ 'జనజాతర' సభలో ఆమె ప్రసంగించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్న ఆమె.. ఆరు హామీలపై కీలక ప్రకటన చేశారు.
చాలా ప్రశాంతమైన క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకరు. అతను ఎప్పుడు కూల్‌గా, ప్రశాంతంగా ఉంటారు. ఫీల్డ్‌లో కూడా చాలా కూల్ గానే కనిపిస్తాడు. క్రికెట్ పరంగా కాకున్నా.. నిజ జీవితంలో కూడా చాలా కూల్‌గా ఉంటాడు. అంతేకాకుండా.. తాను తోటి క్రికెటర్లతో కానీ, ఫ్యామిలీతో కానీ స్పెండ్ చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో మనం వీడియోల్లో చూస్తుంటాం. కాగా.. రోహిత్ శర్మకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అభిమానులకు…
సన్‌రైజర్స్ అభిమానులకు ఇదొక భారీ షాక్ అని చెప్పాలి. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఎడమ మడమ నొప్పి కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమైనట్లు ESPNcricinfo తెలిపింది. కాగా.. మినీ వేలంలో హసరంగను రూ. 1.5 కోట్లకు హైదరాబాద్ దక్కించుకుంది. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా రిస్క్ తీసుకోకూడదని శ్రీలంక అతడికి పూర్తి విరామం ఇచ్చింది. ప్రస్తుతం హసరంగ శ్రీలంకలో విశ్రాంతి తీసుకుంటున్నారు.