Himachal Pradesh: ఘోర ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి ఒకరు మృతి, పలు వాహనాలు దగ్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఉనాలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన తర్వాత.. ఆయిల్ కిందకు కారి మంటలు వ్యాపించాయి. దీంతో పలు వాహనాలు, దుకాణాలు కూడా దగ్ధమయ్యాయి. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం.. హరోలి ప్రాంతంలోని తహ్లివాలా కస్వా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కాగా.. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు.
కాగా.. ఈ ప్రమాదానికి గల కారణం ట్యాంకర్ బ్రేక్ ఫెయిల్ కావడమేనని అధికారులు చెబుతున్నారు. డీజిల్‌తో కూడిన ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో మార్కెట్‌లో బోల్తా పడి మంటలు చెలరేగి స్కూటర్‌తో సహా పలు వాహనాలు దగ్ధమై ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన స్కూటర్ రైడర్‌ను పంజాబ్‌కు చెందిన సుభాష్ చందర్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన ఎనిమిది మందిలో, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని మెరుగైన చికిత్స కోసం ప్రాంతీయ ఆసుపత్రి ఉనాకు రిఫర్ చేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, స్థానిక ఎమ్మెల్యే సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టేందుకు అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారని తెలిపారు. మరోవైపు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను ఆయన ఓదార్చారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!