ఐపీఎల్ 2024లో ఇండియా క్రికెటర్లదే హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు 21 మ్యాచ్ లు జరగ్గా.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇండియా క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ 316 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ (191), రియాన్ పరాగ్ (185), శుభ్ మన్ గిల్ (183), సంజూ శాంసన్ (178)పరుగులతో టాప్ లో కొనసాగుతున్నారు.
Read Also: AP Weather: ఏపీలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం..
అటు బౌలింగ్ లోనూ ఇండియా క్రికెటర్ల హవా కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్ కు చెందిన స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ 8 వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉన్నాడు. ఖలీల్ అహ్మద్ 7, మోహిత్ శర్మ 7 వికెట్లతో టాప్ -3లో ఉన్నారు. కాగా.. టీ20 వరల్డ్ కప్ ముందు ఇండియాకు కలిసొచ్చే అంశమే. కోట్లు కుమ్మరించిన విదేశీ బౌలర్లు ఈ సీజన్ లో ఇప్పటివరకు పెద్దగా రాణించలేదు. మరీ ముఖ్యంగా మిచెల్ స్టార్క్కు రూ. 24.75 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ.. అతను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.
Read Also: Supreme Court: ఎన్నికల వేళ కీలక జడ్జిమెంట్.. ప్రభుత్వానికి చీవాట్లు
మరోవైపు.. బ్యాటింగ్ విభాగంలో విదేశీ ప్లేయర్లు రాణిస్తున్నప్పటికీ, బౌలింగ్ లోనే ఇంకా సత్తా చాటలేకపోతున్నారు. కాగా.. ఇన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ప్లేయర్లపై ఇప్పటికే విమర్శల సునామీ మొదలైంది. అయితే.. ఇప్పుడే మ్యాచ్ లు ముగియలేదు. వాళ్లు ఫాంలోకి రావడానికి ఇంకొద్దిగా సమయం పడుతుందని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.