హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024లో తొలి విజయాన్ని సాధించింది. 29 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి గెలుపు రుచి చూసింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా లేనప్పటికీ.. అతనిలో నాయకత్వ స్ఫూర్తి ఇప్పటికీ కనిపిస్తుంది. మ్యాచ్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ శర్మ స్పీచ్ ఇచ్చాడు.
Read Also: IPL 2024: ఐపీఎల్లో ఇండియా క్రికెటర్లదే హవా..
ఈ మ్యాచ్‌లో రోహిత్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేశాడు. కాగా.. ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చెలరేగడంతో 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత లక్ష్యచేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ 205 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్ నుంచి ముంబై కొత్త సంప్రదాయానికి తెరతీసింది. మ్యాచ్‌లో రాణించిన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు స్పెషల్ అవార్డులను అందిస్తోంది. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు మెడల్ ను అందజేశారు. బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ రోహిత్‌కు బ్యాడ్జ్ బహుమతిగా ఇచ్చాడు.
Read Also: Kakarla Suresh: వ్యవసాయాన్ని పండగ చేస్తా- రైతన్నకు వెన్నుగా నిలుస్తా..!
అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. “ఇది అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అని నేను అనుకున్నాను. ఇలాంటి ప్రదర్శన మొదటి ఆట నుండి మేమంతా ప్రయత్నిస్తున్నాము. వ్యక్తిగత ప్రదర్శనలు పరిగణనలోకి తీసుకోవద్దని సమిష్టిగా రాణిస్తే భారీ స్కోరు సాధ్యమేనన్నాడు. మనం అలాంటి లక్ష్యాన్ని సాధించగలమని ఈ విజయంది చూపిస్తుంది. మనం చాలా రోజులుగా మాట్లాడుకుంటుంది దీని గురించే కదా.. ప్రతి ఒక్కరు తమ వంతు సహకారాన్ని అందిస్తే లక్ష్యాన్ని చేరుకోగలం బ్యాటింగ్ కోచ్, కెప్టెన్ మన నుంచి ఆశిస్తున్నది ఇదే.” అని రోహిత్ శర్మ అన్నాడు. కాగా.. రోహిత్ శర్మ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
A 𝐑𝐨 special at Wankhede. A 𝐑𝐨 special in the dressing room. 🎖️💙#MumbaiMeriJaan #MumbaiIndians #MIvDC | @ImRo45 pic.twitter.com/b555HUvVdE
— Mumbai Indians (@mipaltan) April 8, 2024