భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ తాతా మధు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, వేలాదిమంది కార్యకర్తల శ్రమ, వందల మంది నాయకుల కష్టంతో కేసీఆర్ మార్గదర్శకత్వంలో నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తెల్లం వెంకటరావు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో భద్రాచలం నియోజకవర్గంలో ఏకైక స్థానాన్ని ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారని.. స్థానికుడు చదువుకున్న వ్యక్తి అని ఓటు వేసి…
చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అన్నె సంతోష్ @ సాగర్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. బీజాపూర్ లో సంతోష్ మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో.. స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం (మం) స్వగ్రామం దస్తగిరిపల్లికి చేరింది. అయితే.. స్వగ్రామానికి తీసుకువచ్చిన వృద్ధ తల్లిదండ్రులు అంతక్రియలు నిర్వహిస్తున్నారు. అంత్యక్రియల్లో గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎర్రజెండాలతో స్వాగతం పలికుతూ అంతిమయాత్ర నిర్వహించారు. కన్నీటి పర్యంతంతో గ్రామస్తులు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు డబుల్ డెక్కర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. ఢిల్లీ ముందు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్ లో ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ (49),…
సెలవు రోజులు జలగండాలవుతున్నాయి. సరదాతో కొందరు, ప్రమాదవశాత్తు మరికొందరు మృత్యువాత పడుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆదివారం రోజున ఇద్దరు అన్నదమ్ములు చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా సదుంలో చోటుచేసుకుంది.
ఆదివారం మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలోని ఆయిల్ రిగ్ లో మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 11 మంది సజీవ దహనమయ్యారు. మరో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో.. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు వచ్చారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మా రెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గతంలో పొరుగు రాష్ట్రాలు చూడడానికి వెళ్లామని, ఇప్పుడు పొరుగు రాష్ట్రాలు మన ప్రభుత్వం వైపు చూసి వెళ్తున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట శిరికి రిసార్ట్స్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్.కోట మండల స్థాయి విస్తృత సమావేశంలో ముఖ్యఅతిధిగా మంత్రి పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అభ్యర్థులను చూసి ఓటు వేయండని.. పెద్దపల్లిలో యువకుడి వంశీని ముందుంచామన్నారు. ఈ సందర్భంగా.. నేతకాని సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. తాము ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పనులకు కోడ్ వల్ల ఆటంకం కలిగింది.. 2018 ఎన్నికలు జరిగిన తరువాత రెండు నెలల తరువాత పాలన మొదలు…
కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో దిక్కుమాలిన మేనిఫెస్టో అని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు.. ఐదు న్యాయాలతో దేశ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను బొంద పెట్టారని రాణి రుద్రమ మండిపడ్డారు. దేశ ప్రజలు మోడీకి ఓటు వేయాలని చూస్తున్నారు.. రాహుల్ గాంధీని ఆదర్శంగా…