వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆమె వద్దనే 2.5 లక్షల అప్పు తీసుకున్న ఓ వ్యక్తి.. అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27 మహిళా అదృశ్యం కేసు నమోదు కాగా.. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఎట్టకేలకు నిందితుడు తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకుంటారు. ఈ రోజున ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ రోజును జరుపుకుంటారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో అధికార కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో…
ఈనెల 14న తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారని, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించిన జగన్ మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికీ అవగాహన రాలేదన్నారు. వాలంటరీ వ్యవస్థను ఎన్నికల డ్యూటీలో పెట్టవద్దని ఎన్నికల కమిషన్ చెప్పిందన్నారు. కాంట్రాక్టు బేస్ తో పనిచేసేవాళ్లను ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో వాడదని, గ్రామ…
పల్నాడులోని సత్తెనపల్లి లో మంత్రి అంబటి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు సత్తెనపల్లి లో సభ పెట్టి ముఖ్యమంత్రి జగన్ మీద నా మీద విమర్శలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు కు నన్ను విమర్శించే నైతిక హక్కు లేదని, చంద్రబాబు ను విమర్శించిన వాళ్లను పక్కన పెట్టుకొని మమ్మల్ని విమర్శిస్తున్నాడన్నారు. చంద్రబాబు పదేపదే ఆంబోతు అని విమర్శిస్తున్నాడు చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సప్లై చేసేవాడని, మా పార్టీలో పుట్టి…
ప్రకాశంలో ట్రాఫిక్ మళ్లింపు.. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభ సందర్భంగా ఆ రహదారిలో వాహనాల దారి మళ్లింపు చేశారు పోలీసులు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. మార్కాపురం నుంచి ఒంగోలు వైపు వెళ్లే వాహనాలు నాగిరెడ్డిపల్లి దగ్గర నుంచి వెలిగొండ స్వామి గుడి మీదుగా చినమనగుండం వద్ద నంద్యాల నుంచి ఒంగోలు వెళ్లే రహదారిలో వెళ్లాలి. ఒంగోలు నుంచి మార్కాపురం వైపు వెళ్లే వాహనాలు పొదిలి, చిన్నారికట్ల జంక్షన్ దాటిన తర్వాత పాతపాడు…
ఎన్నికల సమయంలో కనిపించే హడావుడి మణిపుర్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక, ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగులు మాత్రమే కనిపిస్తున్నాయి.
పర్యాటక నగరం విశాఖలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.. మాడు పగిలే ఎండకు నగర వాసులతో పాటు పర్యాటకులు కూడా ఇళ్ల నుండి హోటల్స్ నుండి బయటకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు.. వేడి వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. సాధారణ రోజుల కంటే వీకెండ్స్ ఆదివారాల్లో రద్దీగా ఉండే రోడ్లన్నీ బోసిపోయాయి.. ఉదయం 8-9 గంటల నుండే సూర్యుడు సూర్యుడు సుర్రు మనిపిస్తున్నాడు.. విశాఖలో భగ్గుమని మండుతున్న ఎండల తీవ్రంగా ఉన్నాయి. శనివారం ఏడు జిల్లాలలో దాదాపుగా 45…
విశాఖలో చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.. వారం రోజుల వ్యవధిలో 50 రూపాయలు పెరిగి ట్రిపుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతుంది.. సాధారణంగా వేసవికాలంలో చికెన్ ధరలు నేలచూపు చూసేవి కానీ ఈ సారి మాత్రం భిన్నంగా చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి… దీని గల కారణం చికెన్ కు డిమాండ్ ఉన్న దానికి తగ్గ సప్లై లేకపోవడమే అని వ్యాపారులు చెబుతున్నారు.. మరోవైపు పెరిగిన చికెన్ ధరలతో సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు.. కేజీ రెండు కేజీలు…