ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 164 పరుగుల ఫైటింగ్ స్కోరును ఉంచింది. కాగా.. గుజరాత్ బౌలర్లు బ్యాటర్లను కట్టడి చేయడంతో పరుగులు ఎక్కువ చేయకుండ ఆపారు. ఇదిలా ఉంటే.. లక్నో బ్యాటింగ్ లో మార్కస్ స్టోయినీస్ అత్యధికంగా (58) పరుగులు చేశాడు. ఆ…
చిత్తూరు జిల్లా కమతంపల్లిలో దారుణం జరిగింది. పుంగనూరు మండలం కమతంపల్లిలో మైనర్ బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు గణేష్ అనే ఓ కామాంధుడు. ఈ క్రమంలో అవమానం తట్టుకోలేక మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
మిర్యాలగూడలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. లోక్ సభలో పోటీకి టికెట్ కేటాయింపులలో మాదిగలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రువుగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ భావిస్తుందని తెలిపారు. బీసీలు సైతం కాంగ్రెస్ పార్టీని ప్రథమ శత్రువుగా భావించాలని పిలుపునిస్తోందని అన్నారు. తెలంగాణలో అసలు మాదిగలు లేనట్లుగా భావించి.. పూర్తిగా మాదిగలకు అన్యాయం చేసిన…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్ట్ జడ్జి కావేరి బవెజా తీర్పు ఇవ్వనున్నారు. కాగా.. తన చిన్న కొడుకు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించింది. గత గురువారం నాడు కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత మధ్యంతర బెయిల్ పై స్పెషల్ కోర్ట్ తీర్పు రిజర్వ్ చేసింది.
"ఇప్పటి వరకు అనకాపల్లి బెల్లం గురించే విన్నాం.. కానీ ఇప్పుడు అనకాపల్లి గుడ్డు గురించి వింటున్నా.. ఐదు శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం, ప్రభుత్వ విప్ ఇచ్చినా కిలోమీటర్ రోడ్డు కూడా వేయించుకోలేక పోయారు.." అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి వారాహి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Matchbox: ఢిల్లీలో దారుణం జరిగింది. అగ్గిపెట్టె ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరు టీనేజర్లు, ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన దేశ రాజధానిలోని తిమార్పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరుగనుంది. లక్నో సూపర్ జెయింట్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు ఉండనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన లక్నో ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లక్నోలో జరుగుతుంది.
చేవెళ్ళ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర చేయూతనిచ్చినట్టు కనిపిస్తోంది. శనివారం రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహించిన తుక్కుగూడ బహిరంగ సభ కిక్కిరిసిపోయింది. కాంగ్రెస్ శ్రేణులంతా కదం తొక్కారు. పార్టీ కార్యకర్తలు లక్షలాదిగా తరలిరాగా... చేవెళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి కార్యక్రమ నిర్వహణలో అంతా తానై వ్యవహరించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను ప్రకటించారు. కాసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అభ్యర్థి ఎవరన్న దానిపై చర్చలు కొనసాగాయి. తాజాగా.. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత చెల్లి నివేదితను ఖరారు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.