భువనగిరి పార్లమెంట్ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రంజాన్ తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. భువనగిరిలో బీఆర్ఎస్ లేదు. బీజేపీతోనే మాకు పోటీ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ రానున్నట్లు, మిర్యాలగూడ, చౌటుప్పల్ లో సభ…
కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతో మభ్య పెట్టిందని, కేసీఆర్ డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం అన్నాడు కానీ అయ్యనొక్కడే ఇల్లు కట్టుకున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కూడా ఇళ్లు ఇస్తామంది కానీ ఇంకా జరగలేదన్నారు. భారతీయ ఆత్మ దేవాలయాలని, ఆదర్శ వ్యక్తి రాముడు.. ఇప్పుడు ఆయనకు గుడిని నిర్మించుకున్నామన్నారు కిషన్ రెడ్డి. రామ భక్తుడిగా మోడీ రాముడి దేవాలయాన్ని నిర్మించారని, ఇప్పుడు 302 సీట్లు ఉన్నాయి.. ఈ…
మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా సీఎం చెబుతున్నారన్నారు బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి. ఇవాళ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా రేవంత్ అనుకుంటున్నారన్నారు. పిసిసి పదవీ వేరే.. సిఎం పదవీ వేరే అని, సీఎం పదవి కోసం పది మంది పోటీపడుతున్నారన్నారు మహేశ్వర్ రెడ్డి. సెకండ్ పోజిషన్…
ఇప్పటివరకూ కళాశాల స్థాయిలోనే వినిపించే మాట ఇది. ఇప్పుడది పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాల్లో వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది.
గుండెపోటుతో హఠాన్మరణం పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరై నివాళులు అర్పించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాలని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, కవ్వంపెల్లి సత్యనారాయణలు దర్శించుకున్నారు.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET 2024) దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11 నుండి 20 వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది.
బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాలు దిద్దుతున్న ఓ టీచర్ విద్యార్థి రాసిన జవాబును చూసి కంగుతిన్నారు. తెలుగు సబ్జెక్టులో రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి వింత సమాధానం రాశాడు.
భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురవడంతో నేల తల్లి తడిసింది. దీంతో ఇన్ని రోజులు తీవ్ర ఎండలతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది.