టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జట్టులోని గీత, సీత పేర్ల గురించి తెలిపారు. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ భారత జట్టులోని సీత-గీత అని అన్నారు. వారిద్దరు ప్రతి పనిని కలిసి చేయడానికి ఇష్టపడతారని కోహ్లీ చెప్పారు. ఈ యువ ఆటగాళ్లిద్దరూ గ్రౌండ్ లో ఉన్నప్పుడు వీరి మధ్య ప్రత్యేక సంబంధం, సోదర భావం ఉంటుందని తెలిపారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, డాషింగ్ ఓపెనర్ ఒకరికొకరు చాలా ఇష్టపడతారన్నారు. ఇటీవలి కాలంలో వీరిద్దరూ టీమిండియాకు వివిధ ఫార్మాట్లలో ఆడారు. భారత జట్టు సుదీర్ఘ పర్యటనలో ఉన్నప్పుడు, గిల్-కిషన్ ఒకరికొకరు ఫ్రెండ్లీగా ఉంటూ ఎంజాయ్ చేశారని చెప్పుకొచ్చారు.
Middle East: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత.. ఇరాన్‌కి జర్మనీ విమానాలు రద్దు, జాగ్రత్తగా ఉండాలన్న రష్యా..
విరాట్ కోహ్లి గిల్, కిషన్‌ల మధ్య ప్రేమానురాగాలను వివరిస్తూ.. ఇద్దరూ కవలలుగా కనిపిస్తారని అన్నారు. డిన్నర్ టైమ్ అయినా, టీమ్ మీటింగ్ అయినా కిషన్-గిల్.. ఒకరికొకరు ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి ఇద్దరినీ వేరు చేయడం కష్టం.. ఇద్దరూ కలిసి కనిపిస్తారని కోహ్లీ అన్నారు. ఇషాన్, శుభ్‌మాన్ ఎప్పుడూ చాలా ఫన్నీగా ఉంటారు. వారి మధ్య ఏం జరుగుతుందో తనకు తెలియదని.. ఎక్కువ చెప్పలేం, కానీ ఈ ఇద్దరూ టూర్‌లలో ఒంటరిగా ఉండలేరని కోహ్లీ చెప్పారు. మనం తినడానికి బయటికి వెళితే వాళ్లిద్దరూ వస్తారు.. కలిసి కనిపిస్తారు. తాను వారిద్దరిని ఒంటరిగా చూడలేదని.. వారిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని విరాట్ కోహ్లీ తెలిపారు.
Padala Bhudevi: కన్నీటి పర్యంతమైన జనసేన నేత.. టికెట్ ఇస్తామని చెప్పి..!
అయితే.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2024లో బిజీగా ఉన్నారు. ఈ ముగ్గురు క్రికెటర్లు పటిష్ట ప్రదర్శన చేసి టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. గిల్, కోహ్లీ బ్యాట్‌తో అద్భుతంగా ప్రదర్శన చేస్తుండటంతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ ధరించాడు. ఇషాన్ కిషన్ కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. ఇంకా మెరుగైన ప్రదర్శనను కొనసాగించాలని భావిస్తున్నారు.